తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతిలో  శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింది. కుటుంబసభ్యులందరూ కలిసి అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కుటుంబంతో పాటు వస్తున్న యువతి అకస్మాత్తుగా  కనిపించకుండా పోయింది.  

యువతి కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన యువతి తండ్రి ఆంజనేయులు.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వెస్ట్ పోలీసులు.. మెట్ల మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, యువతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ యువతి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.