తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు హైకోర్టు షాక్.. రేప్ కేసులో క్లీన్ చిట్ రద్దు

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు హైకోర్టు షాక్.. రేప్ కేసులో క్లీన్ చిట్ రద్దు

లైంగిక ఆరోపణల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. 2026 ఆగస్టు 6న వెలువరించి తీర్పులో తేజ్ పాల్ ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 2013లో జూనియర్ కొలీగ్ పై అత్యాచారం చేశాడన్న కేసులో.. ఆయనను దోషిగా తేల్చింది బాంబే హైకోర్టులోని గోవా బెంచ్.

2021లో తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2021 తీర్పుపై గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. ఆగస్టు 6న తేజ్ పాల్ ను దోషిగా తేల్చుతూ తీర్పు ఇచ్చింది. 

జస్టిస్ డా.నీలా గోఖలే, అమిత్ జంసందేకర్లతో కూడిన బెంచ్.. ఇరువైపుల వాదనలు విని తుది తీర్పును వెలువరించింది. 

ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేయాలని చేసిన వాదనలు విన్న కోర్టు.. సాక్ష్యాధారాలు పూర్తిగా పరిశీలించి తేజ్ పాల్ ను దోషిగా తేల్చింది. 

2013 లో తెహల్కా ఎడిటర్ తేజ్ పాల్ సింగ్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆయన జూనియర్ జర్నలిస్టు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. థింక్ ఫెస్ట్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. హోటల్ ఎలివేటర్ లోపల తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. 

ఈ కేసులో 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ మొదలై.. 2021లో ఆయనను నిర్దోషిగా తేల్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.