కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య (65) గుండెపోటుతో బ్యాంకులోనే మృతి చెందిన ఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం సమయంలో గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని SBI బ్యాంకుకు డబ్బులు డ్రా చేసేందుకు బాలయ్య వెళ్లాడు.
అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో జంగపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ALSO READ : పాస్ బుక్ లో పేరు మార్చడం కోసం లంచం...
* కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో గుండెపోటుతో రైతు మృతి
* జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య (65) అనే రైతుగా గుర్తించిన పోలీసులు
* గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన బాలయ్య
* బ్యాంకులోనే అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన రైతు
* ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
* ఈ ఘటనతో జంగపల్లి గ్రామంలో విషాదఛాయలు
