V6 News

ఉప్పల్‌లో మరో హై-వోల్టేజ్ డ్రామా.. హ్యాట్రిక్ విజయంపై SRH నజర్!

ఉప్పల్‌లో మరో హై-వోల్టేజ్ డ్రామా.. హ్యాట్రిక్ విజయంపై SRH నజర్!

SRH vs DC: ఐపీఎల్ 2026 సీజన్ లో మరో రసవత్తరకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. తమ సొంత గడ్డపై ఇప్పటికే వరుసగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు ఢిల్లీపై గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనే కసితో ముందుకు సాగుతుంది. ఇక ప్రస్తుతానికి రెండు జట్లు చెరో 6 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 8 పాయింట్లతో టేబుల్‌లో పైకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ కూడా తక్కువ అంచనా వేయలేం, గత మ్యాచ్‌లో బెంగళూరుపై చివరి బంతి వరకు పోరాడి అద్భుత విజయాన్ని అందుకుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు: 
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ హోరాహోరీగానే ఉంది. ఈ ఇరు టీమ్స్ మధ్య పోరులో మొత్తం 26 మ్యాచులు జరగగా, SRH 13 విజయాలతో ముందుండగా, ఢిల్లీ 12 మ్యాచులలో గెలిచింది. ఇక గత సీజన్ (2025)లో ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. అప్పట్లో ఢిల్లీ 133 పరుగులకే పరిమితమైనా, SRH బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది.

►ALSO READ | IPL నుంచి ఆయుష్ మాత్రే ఔట్.. చెన్నై జట్టుకు పెద్ద దెబ్బే.. MIతో మ్యాచ్లో మాత్రే ప్లేస్లో ఎవరంటే..

ప్యాట్ కమిన్స్ వచ్చినా డౌటే!
సన్‌రైజర్స్ శిబిరంలోకి స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ చేరినప్పటికీ, అతను ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా మిచెల్ స్టార్క్ రాక కోసం ఎదురు చూస్తోంది.

తుది జట్ల అంచనా:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఈషన్ మలింగ.
(ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టన్, స్మరణ్ రవిచంద్రన్)

ఢిల్లీ క్యాపిటల్స్: పథుమ్ నిస్సాంక, KL రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముకేశ్ కుమార్.
(ఇంపాక్ట్ ప్లేయర్స్: అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, నితీష్ రాణా)