నేషనల్ న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ మిల్స్ (ఎన్ఈపీఏ) 45 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 23.
మొత్తం పోస్టులు: 45.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ 12వ తరగతి/ పదో తరగతి/ ఐటీఐ/ బీఈ/ బి.టెక్/ ఎంఎస్సీ/ బీఎస్సీ/ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 50 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ nepamills.co.in ను సందర్శించండి.

