మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు సీపీడబ్ల్యూడీ, రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ/ సాంకేతిక సంస్థల్లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: జులై 27.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ manuu.edu.inను సందర్శించండి.
