ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 242.
కేంద్రాల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్ 60, బెంగళూరు 75, హసన్ 3, హైదరాబాద్ 15, మహేంద్రగిరి 9, న్యూఢిల్లీ 1, శ్రీహరికోట 49, తిరువనంతపురం 30.
ఎలిజిబిలిటీ
అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 సీజీపీఏ సాధించి ఉండాలి. వీటితోపాటు అభ్యర్థులకు కంప్యూటర్ వినియోగంలో తగినంత నైపుణ్యం ఉండాలి.
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్/ స్టెనోగ్రాఫర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నిర్ణీత కాలపరిమితిలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. కనీసం 60% మార్కులు లేదా 6.32 సీజీపీఏ సాధించి ఉండటం తప్పనిసరి.
లేదా కమర్షియల్/ సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 సీజీపీఏతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు స్టెనో-టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్‌గా ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్/ స్టెనోగ్రఫీలో నిమిషానికి కనీసం 60 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ వినియోగంలో తగిన నైపుణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 2026, ఆగస్టు 16 నాటికి జనరల్/ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 28 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 27.
లాస్ట్ డేట్: ఆగస్టు 16.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరు రూ.500 చెల్లించాలి. రాత పరీక్ష రాసిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు మొత్తం అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేస్తారు. ఇతరులకు రూ.400 రీఫండ్ చేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.isro.gov.in ను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. జులై 27 లాస్ట్ డేట్ !
