Hyderabad Industrial Hub: బ్రిటిష్ ఇండియాలో పారిశ్రామికీకరణ పూర్తిగా ప్రైవేట్ఆధ్వర్యంలో జరిగింది. కానీ హైదరాబాద్‌రాజ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందుకోసం 1929లో ప్రభుత్వం కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్ట్రస్టు ఫండ్(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ నిధిని కోటి నుంచి రూ. 3 కోట్లకు పెంచారు. చిన్న పరిశ్రమలకు అప్పుగా ఇచ్చి వాటిని ప్రోత్సహించడంతో పాటు అక్కడ నుంచి వచ్చిన లాభాలను చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. అంతకుముందు 1917లో ఇండస్ట్రియల్ లేబరేటరీ, 1918లో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామిక అభివృద్ధి 3 దశల్లో జరిగింది. మొదటి దశ సాలార్జంగ్–1 ప్రధానిగా ఉన్న 1870లో మొదలై 1918 వరకు కొనసాగింది. రెండో దశ 1919లో మొదలై 1939లో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, మూడో దశ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం 1939 నుంచి 1948 వరకు కొనసాగింది.
* సాలార్జంగ్–1 సంస్కరణల ఫలితంగా ఆధునిక రవాణా, సమాచార రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ద్వారా తెలంగాణ ప్రాంతంలో నూనె ఉత్పత్తులు, మరాఠ్వాడ ప్రాంతంలో పత్తి ఉత్పత్తులు స్టార్ట్ అయ్యాయి. 1899లో హైదరాబాద్ గోదావరి వ్యాలి రైల్వేలైను మన్మాడ్‌ను కలుపుతూ ఏర్పాటు చేయడం ఆ ప్రాంతాల్లో పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలను నెలకొల్పడానికి తోడ్పడింది. హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్, వీవింగ్ మిల్స్ లిమిటెడ్ (1877), మహబూబ్శాయి గుల్బర్గా మిల్స్ (1884), ఔరంగాబాద్ మిల్స్ (1888) స్థాపించారు. డోర్నకల్ జంక్షన్ నుంచి సింగరేణి బొగ్గు గనులకు వేసిన రైలుమార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలిపి 68 వరకు స్థాపించారు.
* డీబీఆర్ మిల్లు(1920): దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లు.. దీన్నే డీబీఆర్ మిల్స్ అంటారు. ఈ మిల్లును 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్ లోయర్‌ట్యాంక్‌బండ్‌లో స్థాపించారు. ఇది ప్రైవేట్ కంపెనీ.. బయట నుంచి తీసుకువచ్చిన ముడి సరుకులతో బట్టలు తయారు చేసే పరిశ్రమ.. ఇది ప్రస్తుతం మూతపడింది.
* నిజాం చక్కెర పరిశ్రమ(1937): నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో స్థాపించారు.
* ఆల్విన్ మెటల్ వర్క్స్: ఆల్విన్ లిమిటెడ్‌ను 1942, జనవరిలో ఆల్విన్మెటల్వర్క్స్గా ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్, మెసర్స్అల్లావుద్దీన్ అనే కంపెనీ ఉమ్మడి వ్యవస్థతో స్థాపించారు.
* ప్రాగా టూల్స్: సికింద్రాబాద్‌లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ అనే పేరుతో 1943, మేలో స్థాపించారు. 1963లో ప్రాగా టూల్స్ లిమిటెడ్‌గా మారుస్తూ డిఫెన్స్ మినిస్ట్రీకి అప్పగించారు.
* సర్‌సిల్క్: సిరిపూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో సిరిపూర్ పేపర్ మిల్లును ఏర్పాటు చేయడంతో దీన్ని సిరిపూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)గా పిలుస్తారు. ఈ పేపర్ మిల్లు భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో ఒకటి. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.
* వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ: ఈ పరిశ్రమను 1916లో హైదరాబాద్విటల్వాడిలో వజీర్ సుల్తాన్ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న వీఎస్టీ అంటే ముషీరాబాద్ – అజామాబాద్‌కు మార్చారు.
ALSO READ : జంతర్ మంతర్ దగ్గర పేలిన పెల్లెట్ గన్స్ అంటే ఏంటి..? ఇవి ఇంత డేంజరా..
* ఆజమ్జాహిమిల్స్: ఇది బట్టలు ఉత్పత్తి చేసే పరిశ్రమ.. 1934లో వరంగల్‌లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైంది.
* దక్కన్ విమానయాన సంస్థ లిమిటెడ్: ఇది హైదరాబాద్ పట్టణంలో బేగంపేట దగ్గర నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్ లైన్స్ కంపెనీ సంయుక్తంగా స్థాపించిన వాణిజ్య విమానయాన సంస్థ.. ఇది 3 విమానయాన సర్వీసులతో ప్రారంభమైంది. 1953లో ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో విలీనమైంది.
* సింగరేణి కాలరీస్(1921): దీనిని ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామం పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడే మొదట బొగ్గు గనులు బయటపడ్డాయి. లండన్‌కు చెందిన హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ సింగరేణి నుంచి బొగ్గు గనులు తవ్వడం ప్రారంభించింది. మొదట్లో దీనిపై పర్యవేక్షణాధికారమంతా ప్రభుత్వాధీనంలోనే ఉండేది. 1920 తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ అనే సంస్థ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ముందుకువచ్చి పరిపాలనా బాధ్యతలు చేపట్టింది.
* హైదరాబాద్స్టేట్ బ్యాంక్: 1941లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వ బ్యాంకును నెలకొల్పాడు. దీన్నే ఆ రోజుల్లో హైదరాబాద్స్టేట్ బ్యాంక్ అనేవారు. ఆ తర్వాత స్టేట్బ్యాంక్ఆఫ్హైదరాబాద్గా మారింది.. ప్రస్తుతం ఈ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీలినం చేశారు.
* కార్ఖానా జిందా తిలిస్మాత్: ఈ కంపెనీ ప్రజలు బాగా ఉపయోగించే జిందా తిలిస్మాత్, ఫారూకి పళ్లపొడి, జిందా బామ్ అనే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమను 1920లో హకీం మహ్మద్ మొహినుద్దీన్ ఫారూకి హైదరాబాద్‌లో స్థాపించారు.
