జంతర్ మంతర్ దగ్గర పేలిన పెల్లెట్ గన్స్ అంటే ఏంటి..? ఇవి ఇంత డేంజరా.. పోలీసులు అలా వాడొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?

జంతర్ మంతర్ దగ్గర పేలిన పెల్లెట్ గన్స్ అంటే ఏంటి..? ఇవి ఇంత డేంజరా.. పోలీసులు అలా వాడొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?

కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు దాదాపు అన్ని అస్త్రశస్త్రాలను వాడేశారు. లాఠీ చార్జీ, వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ లాంటివి ఎక్కడైనా ఉండేవే. కానీ అత్యంత భయంకరమైన పెల్లెట్ గన్స్ వినియోగించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. తీవ్రంగా గాయపర్చడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీయగల పెల్లెగ్ గన్స్ వాడకంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పెల్లెట్ గన్స్ అంటే ఏంటి.. ఎందుకు అంత డేంజర్.. వాటిని వాడాలంటే ఇన్ని రూల్స్ పాటించాలా.. మొదలైన వివరాలు తెలుసుకుందాం.

సీజేపీ ప్రొటెస్ట్ సందర్భంగా నిరసనకారులను చెదరగొట్టడానికే పోలీసులు పెల్లెట్ గన్‌లను ఉపయోగించడంతో తమకు తీవ్ర గాయాలయ్యాయని చాలా మంది  ఆరోపించారు. జులై 20న జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనలో  తనపై పెల్లెట్ గన్‌తో కాల్పులు జరిపారని 25 ఏళ్ల ఉద్యమకారుడు ఆరోపించాడు. లాఠీచార్జి, టియర్ గ్యాస్, పోలీసుల చర్యలు నిరసన ప్రదేశంలో పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చాయని.. ఆ ఘటనలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలను భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

 పెల్లెట్ గన్ వినియోగం?

జులై 20న జరిగిన CJP నిరసన ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల యువకుడు,   పెల్లెట్ గన్లతో దాడి చేయడంతో   కుడి కంటి చూపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. అతను కోలుకునే అవకాశాలు కేవలం ఒక శాతం మాత్రమేనని వైద్యులు తెలిపినట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 ఘర్షణల సమయంలో 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరికి అనేక పెల్లెట్ గాయాలయ్యాయి. అతడిని తర్వాత లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో చేర్చారు. వై ముఖం, శరీర పైభాగం నుండి అనేక పెల్లెట్లను తొలగించారు డాక్టర్లు.  కానీ ఒకటి మెడలోని ప్రధాన రక్తనాళం దగ్గర ఇరుక్కుపోవడం తీవ్ర ప్రమాదంగా మారిపోయింది.

లాఠీచార్జ్ జరిగింది, ఆ తర్వాత టియర్‌గ్యాస్ ప్రయోగించారు. నా కళ్ళు మండటం మొదలయ్యాయి, ఒక్క క్షణం అంతా చీకటిగా అయిపోయింది. మేము వెనక్కి తిరిగి చూసేసరికి, అక్కడ పోలీసు బారికేడ్ ఉండటంతో ఆగిపోయాము అరి భాధితుడు  గుర్తుచేసుకున్నాడు.

►ALSO READ | నీట్ పేపర్ లీక్..కేంద్రం, NTAలకు సుప్రీంకోర్టు నోటీసులు

పోలీసు నాకు తుపాకీ చూపించాడు. నన్ను భయపెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడని నేను అనుకున్నాను, కానీ ఆ తర్వాత అతను ఆయుధాన్ని నా ముఖం వైపు గురిపెట్టి కాల్చాడు. అంత క్లోజ్ గా.. అంత క్రూరంగా కాల్చుతాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

పెల్లెట్ గన్ అంటే ఏమిటి?

పెల్లెట్ గన్ అనేది ఒక రకమైన ఎయిర్ గన్. ఇది సాధారణ బుల్లెట్లకు బదులుగా, కంప్రెస్డ్  ఎయిర్  లేదా గ్యాస్‌ను ఉపయోగించి చిన్న మెటల్ పెల్లెట్లను పేలుస్తుంది. ఇండియాలో దీనిని ప్రధానంగా టార్గెట్ షూటింగ్, క్రీడా పోటీలు, ఎంటర్ టైన్ మెంట్ షూటింగ్ కోసం ఉపయోగిస్తారు.

మన దేశంలో పెల్లెట్ గన్‌ను కలిగి ఉండటానికి ఒక వ్యక్తికి గన్ లైసెన్స్ అవసరం లేదు. కొనే ముందు కూడా జస్ట్ ID ప్రూఫ్ తప్పనిసరిగా సమర్పించాలి. చిన్న కార్బన్ డయాక్సైడ్ కాట్రిడ్జ్‌లను ఉపయోగించే ఒక మోడల్ కూడా ఉంది. ఇది వేగంగా మరియు పదేపదే కాల్చడానికి వీలు కల్పిస్తుంది.

ఇండియాలో పెల్లెట్ గన్‌లను ఎవరు కలిగి ఉండవచ్చు?

మన దగ్గర 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పెల్లెట్ గన్‌ను కలిగి ఉండవచ్చు,  ప్రభుత్వ- ఫోటో ID ఉంటే సరిపోతుంది. నేర చరిత్ర లేని వ్యక్తి  డీలర్ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేయవచ్చు.

ఆయుధాల నియమాలు, 2016 ప్రకారం, పెల్లెట్ గన్ లైసెన్స్ అవసరం లేని తుపాకీనే .. కానీ దాని క్యాలిబర్ 1.77 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

మీరు దీనిని ప్రైవేట్ భూమిలో, లేదా కంచె ఉన్న పెరళ్లలో, లేదా ప్రత్యేకంగా కేటాయించిన షూటింగ్ రేంజ్‌లలో మాత్రమే కాల్చడానికి అనుమతిస్తారు. పబ్లిక్ ప్లేస్ లలో  ఒక్క క్షణం పాటు కాల్చినా బొక్కలో వేస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి.

పెల్లెట్ గన్‌లు ప్రమాదకరమా?

పెల్లెట్ గన్‌లు ప్రమాదకరమైనవి, తీవ్రమైన గాయాలకు లేదా మరణానికి కూడా కారణం అవ్వొచ్చు. లెడ్ తో చేసిన పెల్లెట్స్ బాడీలో లోతుగా చొచ్చుకుపోగలదు.బాడీకి చిల్లులు పెట్టడమే కాకుండా పలుచని ఎముకలను విరగ్గొట్టగలవు.

ఒకవేళ పెళ్లెంట్ నేరుగా కంటిలోకి తగిలితే, అది శాశ్వత అంధత్వానికి లేదా తీవ్రమైన కంటి గుడ్డు పగిలిపోవడానికి కారణం కావచ్చు. ఇది మన  మెదడు కుహరంలోకి కూడా ప్రవేశించగలదని వైద్యులు చెబుతున్నారు.