NCC సర్టిఫికెట్ ఉందా? ఇండియన్ ఆర్మీలో చేరేందుకు గొప్ప ఛాన్స్.. రాత పరీక్ష లేకుండ ఎంపిక!

 NCC సర్టిఫికెట్ ఉందా?  ఇండియన్ ఆర్మీలో చేరేందుకు గొప్ప ఛాన్స్.. రాత పరీక్ష లేకుండ ఎంపిక!

భారతీయ సైన్యం మహిళా అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఎన్​సీసీ ‘సి’ సర్టిఫికెట్ కలిగిన వివాహం కాని మహిళలు, యుద్ధంలో అమరులైన/ గాయపడిన ఆర్మీ సిబ్బంది పిల్లల నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (2027, ఏప్రిల్) -ఎస్ఎస్​సీడబ్ల్యూ (ఎన్​సీసీ)-125 కింద ఈ నియామకాలను చేపట్టనున్నారు.

మొత్తం ఖాళీలు: 6. 

జనరల్ క్యాటగిరీ 5, యుద్ధంలో మరణించిన లేదా గాయపడిన సైనికుల పిల్లలు 1.     

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. 

ఎన్​సీసీ సీనియర్ డివిజన్ లేదా సీనియర్ వింగ్​లో రెండు లేదా మూడేళ్ల సర్వీస్  పూర్తిచేసి ఉండాలి.  ఎన్ సీసీ ‘సి’ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ సాధించి ఉండాలి.  అప్లై చేసే నాటికి సి సర్టిఫికెట్ లేనివారు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ మాత్రమే ఉన్నవారు  అర్హులు కారు.

వయోపరిమితి: 2027, జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 2002, జనవరి 2 కంటే ముందు గానీ 2008, జనవరి 1 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 21.

లాస్ట్ డేట్: ఆగస్టు21. 

ఎస్ఎస్​బీ షార్ట్ లిస్టింగ్: సెప్టెంబర్ మొదటి వారం.

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: డిసెంబర్/ నవంబర్. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్​బీ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి.