V6 News

ప్రకృతిని కాపాడుకునేందుకు..ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రకృతిని కాపాడుకునేందుకు..ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పెట్రోల్ , డీజిల్ వెహికల్స్ బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ప్రపంచ భూమి ఆరోగ్య దినోత్సవం సందర్భం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో  అధునాతన టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రేర్ హెల్త్  మినరల్స్ చాలా కీలక పోషిస్తాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఫ్యుయెల్ సంక్షోభం కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని వాడుకోవాలి. మనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈవీ  వెహికల్స్ వాడకంతో  గొప్ప ఫలితాలు వస్తాయి.. చమురు దిగుమతులపై ఆధార పడాల్సిన  అవసరం ఉండదు.. మరోవైపు పర్యావరణానికి ఎంతో మేలు జరుతుందన్నారు. 

టాటా కంపెనీతో కలిసి రాష్ట్రంలో 4వేల కోట్లతో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు స్కిల్స్ డెవలప్ మెంట్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25వేల మందికి విద్యార్థులను విదేశాలకు పంపామన్నారు మంత్రి. ఇంకా రాష్ట్రానికి రాబోతున్న కొత్త  కంపెనీలకు మ్యాన్ పవర్ అందించే విధంగా   కొత్త కొత్త కోర్సులలో  శిక్షణ ఇవ్వడం ద్వారా స్కిల్డ్ మ్యాన్ పవర్ ను పెంచుతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.