మా జోలికొస్తే ఏ సూపర్‌పవర్‌‌నూ వదలం

మా జోలికొస్తే ఏ సూపర్‌పవర్‌‌నూ వదలం

బెంగళూరు: భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోదని, కానీ ఎవరైనా దాడికి దిగితే మాత్రం దీటుగా బదులిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. ఏ సూపర్‌‌పవర్ అయినా భారత గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోబోమని పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపారు. బెంగళూరులో నిర్వహించిన ఐదో ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్తర్న్ బార్డర్స్‌‌‌‌ను పహారా కాస్తున్న సైనికులను మెచ్చుకున్నారు. ‘మేం ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోం. కానీ దేశ రక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. మాతో ఏ సూపర్‌‌పవర్ అయినా పెట్టుకోవాలని చూసినా, మా ఆత్మగౌరవానికి భంగం కలిగించాలని చూసినా మా సైనికులు దీటుగా బదులిస్తారు. దాయాది దేశాలతో స్నేహపూర్వక, శాంతియుత, సుహృద్భావ సంబంధాలనే మేం కోరుకుంటున్నాం. అది మన రక్తం, సంస్కృతిలోనే ఉంది’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.