బిడెన్ గెలిస్తే యూఎన్‌లో ఇండియాకు పర్మినెంట్ సీట్

బిడెన్ గెలిస్తే యూఎన్‌లో ఇండియాకు పర్మినెంట్ సీట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్‌ల తరఫున ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్ పోటీలో ఉన్నారు. ట్రంప్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే బిడెన్ ప్రెసిడెంట్ అయితే ఇండియాకు ప్రయోజనకరంగా ఉంటుందని అమెరికన్ మాజీ టాప్ డిప్లొమాట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బిడెన్ గెలిస్తే యునైటెడ్ నేషన్స్‌లో ఇండియాకు పర్మినెంట్ సీటు లభిస్తుందని ఇండియాలో యూఎస్ అంబాసిడర్‌‌గా పని చేసిన రిచర్డ్‌ వర్మ శనివారం చెప్పారు.

‘యూఎన్ లాంటి ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లోని సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇండియాకు సీటు వచ్చేందుకు బిడెన్ నాయకత్వం హెల్ప్ అవుతుంది. మేజర్ డిఫెన్స్ పార్ట్‌నర్‌‌గా ఉండాలన్న ఇండియా ఆశలను ఆయన సాకారం చేస్తారు. రెండు దేశాల పౌరులను సురక్షితంగా ఉంచడానికి ఆయన ఇండియాతో కలసి పని చేస్తారు. దానర్థం.. బార్డర్స్‌లో అటాక్ చేసే టెర్రరిస్టులు, సరిహద్దుల వద్ద ఉద్రికత్తతలకు పక్క దేశాలు పాల్పడినప్పుడు ఇండియాకు మేం అండగా ఉంటాం. ఇండియా–అమెరికా బంధాలను మరింత బలోపేతం చేసి కొత్త ఎత్తులకు చేరవేయడంలో బిడెన్ కృషి చేస్తారనడంలో సందేహం లేదు’ అని రిచర్డ్‌ వర్మ పేర్కొన్నారు.