ఓఎల్‍ఎక్స్ లో సైబర్‍ దొంగలు

ఓఎల్‍ఎక్స్ లో సైబర్‍ దొంగలు

వెలుగు: ఓఎల్ఎక్స్ అడ్డాగాసైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఆర్మీ ఉద్యోగుల పేర్లతో వాహనాలను అతి తక్కువ ధరకే అంటూ సెకండ్ సేల్ కి పెడుతున్నారు. ఇదినమ్మిన వారి నుంచి భారీ మొత్తంలో లూటీచేస్తున్నారు. కొరియర్, ట్రాన్స్ పోర్ట్, పార్సిల్ చార్జీలని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి సాగర్ రింగ్ రోడ్డులోని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అతడు గుర్తించగానే ఓఎల్ఎక్స్ యాడ్ తో పాటు అతని మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ ఇమేజెస్ డిలీట్ అయ్యాయి

ఆర్మీ అధికారినని నమ్మించాడిలా
లింగస్వామి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇంటి అవసరాల కోసం చిన్న బైక్ కొందామనుకున్నాడు .ఓఎల్ఎక్స్ లో సెర్చ్ చేశాడు. దీంతో లింగస్వామి ఇంటికి సమీపంలోని అడ్రెస్ పేరుతో ‘‘హీరోమ్యాస్ట్రో ’’ 2017 మోడల్ బైక్ కనిపించింది. టీఎస్13ఇహెచ్6532 నంబర్ తో గల టూవీలర్ అమ్మాకానికి పెట్టినట్లు గమనించాడు.సుమారు రూ.60 వేలు విలువ చేసే బైక్ రూ.25వేలకు మాత్రమే సెకండ్ సేల్ కు పెట్టడంతో కొనాలనుకున్నాడు. రవికుమార్ పేరుతో జరిగిన పోస్టింగ్ నాగోల్ హనుమాన్ టెంపుల్ సమీపంలో ల్యాండ్ మార్క్ చూపించింది.యాడ్ లో ఇచ్చిన బైక్ వివరాలను పోస్ట్ చేసిన రవికుమార్ అనే వ్యక్తితో ఫైనల్ రేట్ తెలుసుకునేందుకు లింగస్వామి చాట్ చేశాడు. సదరువ్యక్తితో బేరం కుదుర్చు కునేందుకు ఫోన్‍ నంబర్‍ అడిగి తీసుకుని కాల్‍ చేశాడు. తను ఎయిర్ పోర్ట్
లో ఆఫీసర్ నని, ఢిల్లీ ట్రాన్స్ ఫర్ కావడంతో బైక్ ను అమ్మకానికి పెట్టానని అతడు నమ్మించాడు. చివరకు రూ.20వేలకు ధర కుదిరింది. ఐతే టీఎస్13ఇహెచ్6532 నంబర్ గల ఈ బైక్ ఓనర్అశ్రాఫ్ ఫాతీమా పేరుతో రిజిస్టార్ అయ్యింది.ఈ బైక్ పై 19 హెల్మెట్ ఛలానాలు పెండింగ్ లోఉన్నాయి. అవి కూడా రాజేంద్రనగర్, టోలీచౌకీ ఏరియాల్లోనే ఉన్నాయి.

కొరియర్ చేస్తానని
బైక్ కండీషన్ చూశాకే డబ్బు చెల్లిస్తానని,ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తానని లిం గస్వామి కోరగా అవతలి వ్యక్తి నిరాకరించాడు. తాను డ్యూటీలో ఉన్నానని, కలవడంకుదరదన్నాడు. బైక్ ను కొరియర్ చేస్తానని..అందుకోసం రూ.2000 గూగుల్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. అనుమానం వచ్చిన లింగస్వామి ఓఎల్ఎక్స్ లో బైక్ పూర్తివివరాలు తెలుసుకునేందుకు యత్నించాడు. దీంతో అలెర్టైన సైబర్ మోసగాడు లింగస్వామి వాట్సాప్ నంబర్ కి తను పంపిన ఇమేజెస్అన్నీ నిమిషాల వ్యవధిలోనే డిలీట్ చేశాడు.ఇందులో ఆర్మీ యూనిఫాంతో ఉన్న ఫొటో, నకిలీ ఐడీ కార్డులు, తను ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేసిన బైక్ ఇమేజెస్ పూర్తిగా డిలీట్ చేశాడు. దీంతో లింగస్వామి మళ్లీ ఓఎల్ఎక్స్ సైట్ వెతికాడు. అందులో తను చూసిన యాడ్ ప్లేస్ లో ‘‘సస్పీషియస్ యూజర్ డిటె క్టెడ్’’ బైక్ ను పోస్ట్ చేసిన యూజర్ ఓఎల్ఎక్స్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు అతనితో ఎవ్వరు కమ్యూనికేట్ చేయడం కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ జరుపకూడదని ఓఎల్ఎక్స్ గ్రూప్ పోస్ట్ చేసింది.’’ దీంతో మోసం విషయం తెలుసుకున్న లింగస్వామి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు.