ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బీజేపీ ‘పల్లె గోస–బీజేపీ భరోసా’

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బీజేపీ ‘పల్లె గోస–బీజేపీ భరోసా’
  • జుక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగిన బీజేపీ యాత్ర
  • పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి 

పిట్లం, వెలుగు: పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బీజేపీ ‘పల్లె గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం జుక్కల్​ మండలంలో బీజేపీ భరోసా యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను ఓపిగ్గా వింటూ వారికి భరోసా కలిగిస్తూ వివేక్​వెంకటస్వామి యాత్ర కొనసాగించారు. మండలంలోని సిద్దాపూర్​గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు.

గ్రామంలో ఒక్క డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇల్లు ఇవ్వలేదని, వర్షాలకు ఇబ్బందులు పడుతూ రేకుల షెడ్లలో, ఇరుకు ఇండ్లల్లో నివాసముంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఆయన త్వరలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు గ్రామాల్లోని అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుండూరు, జుక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భరోసా యాత్ర కొనసాగింది. బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా స్థానిక యువకులు గుర్రాలపై చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జిల్లా సెక్రటరీలు కాలకుంట్ల రాము, తేలు శ్రీనివాస్, బద్దం మహిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్​వెంకటరమణారెడ్డి, జుక్కల్​ అధ్యక్షుడు శివాజీరావు, లీడర్లు కిష్టారెడ్డి, ప్రశాంత్​ ​పటేల్, కృష్ణ పటేల్, అశోక్​పటేల్​ పాల్గొన్నారు.