వాయిస్ తో క‌రోనా టెస్ట్ లు.. త్వ‌రలో ముంబైలోనే

వాయిస్ తో క‌రోనా టెస్ట్ లు.. త్వ‌రలో ముంబైలోనే

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ టెస్ట్ లు చేసేందుకు భారంగా మారింది. దీంతో ప‌లు దేశాల్లో క‌రోనా టెస్ట్ చేయాలంటే రోజుల త‌ర‌బ‌డి క్యూలైన్ ల‌లో వేచి చూడాల్సి ఉంది. అదే స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మించి ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఘ‌ట‌న‌ల్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త్వ‌రలోనే ఆ బాధ‌ల నుంచి విముక్తి క‌లిగించేందుకు ఆర్టీపీషియ‌ల్ టెక్నాల‌జీతో క‌రోనా టెస్ట్ లు చేసేందుకు ప‌లు కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే ఈ టెక్నాల‌జీతో ఇట‌లీతో పాటు ఫ్రాన్స్ దేశాలు క‌రోనా టెస్ట్ లు చేస్తున్నాయి. తాజాగా ఈ టెస్ట్ లు ముంబై ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ముంబైకి చెందిన బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) మ‌రో వారం రోజుల్లో మనిషి వాయిస్ టెస్ట్ ద్వారా కరోనా ఉందో లేదో చెప్పే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు అడిష‌న‌ల్ మున్సిప‌ల్ క‌మీష‌నర్ సురేష్ కాకాని తెలిపారు. ట్ర‌య‌ల్స్ లో భాగంగా గుర్ గావ్ కు చెందిన వెయ్యిమందికి ఈ టెస్ట్ లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు

క‌రోనా టెస్ట్ ఎలా చేస్తారు

నేవి ముంబై ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్ధులు వాయిస్ అనలిటిక‌ల్ ప్రోగ్రామ్ ను డెవ‌ల‌ప్ చేశారు. ఆ వాయిస్ ప్రోగ్రామ్ ద్వారా క‌రోనా టెస్ట్ లు చేయ‌నున్నారు. ‌
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మనుషులు గట్టిగా గట్టిగా మాట్లాడడంలో ఊపిరితిత్తుల సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేని వాళ్ల‌కు ఊపిరితిత్తులు బాగా ప‌నిచేస్తాయి. గ‌ట్టిగా మాట్లాడ‌తారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారి వాయిస్ కూడా తక్కువ‌గా ఉంటుంది. ఆ వాయిస్ ద్వారా ఈ టెక్నాలజీ పసిగడుతుంది. దీంతో టెస్ట్ లు చేయ‌డం సుల‌భ‌త‌రం కానుంది.