ఈ వజ్రం జీవితాన్ని మార్చేసింది

ఈ వజ్రం జీవితాన్ని మార్చేసింది

జీవితాన్ని మార్చిన వజ్రం

33 ఏళ్ల కింద రూ.850 లకు వజ్రం కొన్న మహిళ

ఇప్పుడు వేలంలో రూ.6కోట్లకు అమ్మకం

లండన్ : అదృష్టమంటే ఆ మహిళదే. ఆమె పేరు డెబోరా గోడార్ట్. వయసు 55 ఏళ్లు. 33 ఏళ్ల కింద ఈ బ్రిటన్ మహిళ ఓ వజ్రాల మార్కెట్ లో ఓ ఉంగరం కొనుక్కుంది. ఖరీదైనవి కొనేందుకు డబ్బుల్లేక… 12 డాలర్లతో ఆ రోజుల్లో ఆ రేటుకు వచ్చిన ఉంగరాన్నే కొనుగోలు చేసి చేతికి పెట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత.. ఆమె చేతికి ఉన్న ఉంగరం చూసిన ఓ వజ్రాల వ్యాపారి అది తనకు అమ్మాలని కోరాడు. అప్పుడెప్పుడో కొన్నా.. ఇది పెద్దగా ఖరీదు చేయదని ఆమె చెప్పింది. దాని విలువ ఈ రోజుల్లో మామూలుగా ఉండదని చెప్పాడు ఆ డైమండ్ బిజినెస్ మ్యాన్. వజ్రాల నిపుణులతో పరీక్షలు చేయించి.. అది పురాతనమైనదని కన్ ఫామ్ చేసుకున్నాడు. ఆ వజ్రం 26.27 కె.క్యారట్ తో తయారుచేసిన అసలు సిసలైన అత్యంత విలువైన వజ్రమని తేల్చారు.

వజ్రానికి ఉన్న విలువ తెలియడంతో… తన ఉంగరాన్ని వేలం వేయాలనుకుంది డెబోరా. ఇటీవలే బ్రిటన్ లో నిర్వహించిన వేలంలో…  ఆ వజ్రపుటుంగరం… అక్షరాలా రూ.6కోట్లకు అమ్ముడుపోయింది. టాక్సులు పోనూ ఆ మహిళకు రూ.4.5 కోట్లు ముట్టజెప్పారు అధికారులు. 33 ఏళ్ల కిందట.. 850 రూపాయలకే(భారత కరెన్సీలో) కొనుగోలు చేసిన ఉంగరం.. ఇపుడు భారీ ధరకు వేలంలో అమ్ముడుపోవడంతో.. ఆమె కోటీశ్వరురాలైపోయింది.