దరిద్రం లాటరీ రూపంలో తగలడం అంటే ఇదే: రూ.30 కోట్లతో ప్రియురాలు జంప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

దరిద్రం లాటరీ రూపంలో తగలడం అంటే ఇదే: రూ.30 కోట్లతో ప్రియురాలు జంప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఒట్టావా: అదృష్టం తలుపుతట్టే లోపే.. దరిద్రం ఊరంతా తిరిగి వచ్చిన చందంగా మారింది ఓ వ్యక్తి పరిస్థితి. లాటరీలో ఊహించని విధంగా రూ.30 కోట్ల జాక్ పాట్ తగిలిందని ఆనంద పడే లోపే.. ఆ డబ్బులతో ప్రియురాలు ఊడాయించి షాక్ ఇచ్చింది. సరే ప్రియురాలు వెళితే వెళ్లిందిలే అనుకునే లోపే.. ఆ వెళ్లింది మరో యువకుడితో అని తెలిసి సదరు వ్యక్తి గుండె బద్దలైంది. ఈ ఘటన కెనడాలో  చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. కెనడా దేశస్థుడు లారెన్స్ కాంప్ బెల్ 2024లో లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి 5 మిలియన్ల కెనడా డాలర్లు (మనకరెన్సీ ప్రకారం రూ.30కోట్లు) గెలుచుకున్నాడు. దుర దృష్టం ఏమిటంటే ప్రైజ్ మనీ తీసుకునేందుకు అతనికి వ్యాలిడ్ బ్యాంక్ ఐడీ లేదు. దీంతో అప్పటి తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్టాల్ అన్ మెక్కేనీని లాటరీ డబ్బులు తన అకౌంట్లో వేసుకోవాల్సిందిగా కోరాడు. 

ALSO READ | వారిపై లేని చర్యలు షర్మిస్తాపై ఎందుకు.. ఇదేనా లౌకికవాదం: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్..

గడిచిన ఏడాదిన్నర కాలంగా వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో నమ్మి ఈ పని చేశాడు. ప్రియురాలు కూడా ఓకే అని.. లాటరీ డబ్బులను తన అకౌంట్లో జమ చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలం వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు  కానీ కొన్నాళ్లకు ప్రేయసి కనిపించకుండా పోయింది. ఒకవైపు ప్రేయసి.. మరోవైపు రూ.30 కోట్ల డబ్బు కనిపించకుండా పోవడంతో లారెన్స్‎లో వర్ణించలేని ఆందోళన మొదలైంది. దీంతో తిండి తిప్పలు మాని ప్రేయసి కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. 

చివరకు ప్రేయురాలి ఆచూకీ కనిపెట్టాడు. కానీ లారెన్స్‎కు గుండె బద్దలు అయ్యే వాస్తవం తెలిసింది. తన రూ.30 కోట్ల డబ్బుతో తన ప్రియురాలు మరో యువకుడితో జంప్ అయ్యిందని తెలిసింది. వచ్చిన రూ.30 కోట్ల లాటరీ డబ్బులతో ప్రియురాలితో కలిసి హ్యాపీగా ఉండొచ్చని ప్లాన్ చేస్తే.. గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనను మోసం డబ్బుతో మరో ప్రియుడితో ఊడాయించిందని తెలుసుకుని లారెన్స్ లోలోన కుమిలిపోయాడు. ఇక లవర్ పోతే పోయింది కానీ.. తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాలని లారెన్స్ కోర్టును ఆశ్రయించాడు. డబ్బు, ప్రేమ రెండింట్లో మోసపోయిన లారెన్స్‎కు కనీసం కోర్టులో అయినా న్యాయం జరుగుతుందో చూడాలి మరీ.