ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దాడులు

ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దాడులు

బిహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టు జరిగే రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లల్లో సీబీఐ దాడులు జరగడం కలకలం రేపింది. రైల్వే ఉద్యోగాల స్కాం కేసులో  RJD నేతల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.  RJDకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఎంపీల నివాసాల్లో సోదాలు చేపట్టింది. పాట్నాలోని సుబోధ్ రాయ్, సునీల్ సింగ్, అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్ ల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు..



యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ టైంలో రైల్వే నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకు అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే భూములు తీసుకున్నట్లు కేసు నమోదైంది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్ లపై సీబీఐ కేసులు నమోదు చేసింది . ఇదే కేసులో మిసా భారతిని అరెస్టు చేయగా.. లాలూ OSD గా పనిచేసిన భోలా యాదవ్ ను అదుపులోకి తీసుకుంది.

మరోవైపు ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దాడులు చేస్తున్నట్లు సునీల్ సింగ్ విమర్శించారు.  ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారతారనే అభిప్రాయంతోనే కేంద్రం CBI సోదాలు చేయిస్తుందన్నారు.