కేసీఆర్ కి ఇది త‌గ‌దు : ఆస్ప‌త్రుల‌లో ఆరోగ్య‌శ్రీ ని ఎందుకు చేర్చ‌లేదు

కేసీఆర్ కి ఇది త‌గ‌దు : ఆస్ప‌త్రుల‌లో ఆరోగ్య‌శ్రీ ని ఎందుకు చేర్చ‌లేదు

సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గత ఆరు నెలలుగా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని..? ప‌్ర‌శ్నించారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల‌న్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం తో లక్షలాది మంది రోగులు ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటుంటే… తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకం లేక,.. ఆయుష్మాన్ భారత్ పథకం లేక ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు.

ప్రభుత్వాసుప‌త్రిలో వసతులు లేక,పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్దాం అంటే ఆరోగ్యశ్రీ పథకం లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్నిపనికిరాని పథ‌కమని.. కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేస్తూ మాట్లాడటం స‌మంజ‌సం కాద‌న్నారు. సీఎం స్థాయికి అది మంచిది కాద‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు.