కరోనా వైద్యం పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ

కరోనా వైద్యం పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ

రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి… లేని వారికి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా లక్షణాలు లేని,తేలికపాటి లక్షణ కేసులకు ఆస్పత్రి అవసరం లేదంది. తేలికపాటి లక్షణాలు లేదా లక్షణాలు లేని రోగిని ఆస్పత్రిలో చేరిన 24 గంటలలోపు డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది. లక్షణాలు లేని వారు హోం క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని…అన్ని ఆస్పత్రులు కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలన్న ఆదేశించింది ఆరోగ్య శాఖ.