Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ

Megastar Chiranjeevi: గెటప్ శ్రీను సినిమాపై చిరు స్పెషల్ వీడియో..మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ

‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను(Getup Srinu) ‘రాజు యాదవ్’(Raju Yadav) చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి దర్శకుడు.కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మిస్తున్నారు.ఇప్పటికే టీజర్, సాంగ్స్,ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ మూవీ మే 24న గ్రాండ్ గా థియేటర్లలలో రిలీజ్ కాబోతుండటంతో..మేకర్స్ ప్రమోషన్స్ లో వేగా,ఎం పెంచేశారు. ఇందులో భాగాంగా ఇన్నాళ్లు కమెడియన్ గా అలరించిన గెటప్ శ్రీనుని ప్రోత్సహిస్తూ టాలీవుడ్ యంగ్ హీరోల నుంచి బడా హీరోల వరకు సినిమా ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ గెటప్ శ్రీనుని హీరోగా చేసే రాజు యాదవ్ సినిమాను ప్రోత్సహించారు. "మన కళ్ళ ముందు నటిస్తూ..నవ్విస్తూ రకరకాల గెటప్ లు, గొంతులు, యాస, భాషలతో అలరించే నటుడు గెటప్ శ్రీను. ఈ తరం యువ కామెడీ నటులలో నాకిష్టమైన నటుడు శ్రీను అని అన్నారు. ఇపుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతోగాను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూశాక..ఈ సినిమాలో గెటప్ శ్రీను నటనలో చూపించిన అభినయం, కామెడీ, ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం గెటప్ శ్రీనుని చూస్తుంటే..చలం గారిని చూసిన ఫీలింగ్ కలుగుంతుందని..ఈ సినిమా మే 24న రిలీజ్ కాబోతుంది..ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని" చిరు కోరారు. 

ఈ వీడియోని గెటప్ శ్రీను షేర్ చేస్తూ ఎమోషన్ అయ్యారు. "స్థాయి,అంతస్థు చూడని మీ మనస్థత్వానికి..ప్రతిభకు మీరు ఇచ్చే ప్రోత్సాహకానికి..కల్మషం లేని మీ ప్రేమకి..సదా భక్తుడిని పద్మ విభూషణ". మీ ఉదార ప్రశంసలు మరియు మా రాజుయాదవ్ చిత్రానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం నాకు కన్నీళ్లు తెప్పించాయి. నా ఆరాధ్యదైవం నుండి ఇలాంటి మంచి మాటలు రావడం గొప్ప గౌరవం. మీ తిరుగులేని మద్దతు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్. ఇది నాకు మరియు మా టీమ్ మొత్తానికి ప్రపంచం అంటూ గెటప్ శ్రీను పోస్ట్ చేశారు.ఈ సినిమాలో అంకితా ఖరత్ హీరోయిన్ గా నటించగా..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.