కొత్త ఓటర్లందరికి స్పీడ్ పోస్ట్లో కార్డులు

కొత్త ఓటర్లందరికి స్పీడ్ పోస్ట్లో కార్డులు

హైదరాబాద్, వెలుగు: ఓటరు ఐడీ కార్డులతో ఆధార్ అనుసంధానం త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ సూచించారు. కొత్తగా చేరిన ఓటర్లందరికి స్పీడ్ పోస్ట్ ద్వారా కొత్త కలర్ పీవీసీ ఎపిక్ కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. 2022 సెప్టెంబర్‌‌ వరకు ఎపిక్ కార్డులు అందని ఓటర్లకు స్పీడ్ పోస్ట్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 15.6 లక్షల ఎపిక్ కార్డులకు 14 లక్షల ఎపిక్ కార్డులు ప్రింట్ చేసినట్లు వివరించారు. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురించిన తర్వాత దరఖాస్తు చేసుకున్నవాళ్లకు త్వరలో అందజేస్తామని అన్నారు. ఇటీవల 12.55 లక్షల ఓటర్ కార్డులు ఫొటో సిమిలర్ ఎంట్రీలో ఉన్నాయని, వీటిని వెరిఫై చేసి డూప్లికేట్ ఓటర్లను తొలగిస్తామన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటర్స్ డే ప్రతిజ్ఞను చేయించాలని, ప్రతి చోట మెయిన్ భారత్ హూ పాట ప్లే చేయాలన్నారు.