గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల: తనకు ఓటు వేసి గెలిపిస్తే.. పెద్దపెల్లి నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్తి  గడ్డం వంశీకృష్ణ. మే 4వ తేదీ శనివారం తాండూరు మండల కేంద్రంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్న వంశీకృష్ణ మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు కారు గుర్తుకు ఓటు వేసి మోసపోయారన్నారు.

కేసీఆర్ ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని మోసం చేశాడని వంశీ విమర్శించారు. డబులు బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని మభ్యపెట్టారని దుయ్యబట్టారు.  గతంలో ఇదరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ సర్కారే అని అన్నారు. .  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు వస్తాయని చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే  వినోద్ మాట్లాడుతూ.. తాను మంత్రిగా వున్నప్పుడు 2005లో ఉపాధి హామీ పనులను తీసుకొచ్చామని చెప్పారు. ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలకు పెంచుతామన్నారు. చదువుకున్నల్లోకు సిఎంతో మాట్లాడి.. విద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. వేమనపల్లిలో రూ.24 కోట్ల నిధులతో రోడ్లు వేయించానన్నారు. బెల్లంపల్లిలో పలు అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.  ఆగస్టు 15 తరువాత రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి వంశీని గెలిపిస్తే నియోకవరగన్ని అభివృద్ధి చేస్తాడని అన్నారు.