యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు

యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు

ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. రోజుకో విధంగా ఆన్లైన్లో రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతూ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను ఖా ళీ చేస్తున్నారు. ప్రముఖ మేసేజింగ్ యాప్లను వినియోగించుకొని కూడా డబ్బులు దోచుకుంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ క్రూక్స్ ప్రజలను దోచేస్తు న్నారు. తాజాగా ఈజీ మనీ పేరుతో ఓ మహిళా వ్యాపారిని తప్పుదారి పట్టించి 2.7 కోట్లు బ్యాంకు ఖాతానుంచి ఖాళీ చేశారు. 

సైబర్ క్రూక్స్ బారిన పడి 52 ఏళ్ల మహిళా వ్యాపారి రూ.2.7 కోట్లు కోల్పోయింది. యూట్యూబ్ ఛానెల్ లను లైక్ చేయడం ద్వారా సులభంగా డబ్బుులు సంపాదించొచ్చని నమ్మించారు. ఓ లింక్ పంపించి క్లిక్ చేయమన్నారు.. దీంతో లింక్ చేయగా.. ఆమెను ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు. సైబర్ నేరగాళ్లు పంపించిన యూట్యూబ్ ఛానెల్ లింక్ లను లైక్ చేస్తే..మొదట కొంత అమౌంట్ ను పంపించి ఆమెను నమ్మించారు. 

తర్వాత ఎక్కువ మనీ రావాలంటే కొంత పెట్టుబడి పెట్టాలని కోరారు. ఇలా రూ. 2.7 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టేలా మోటివేట్ చేశారు. మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దర్యాప్తు ప్రారంభించి నేరగాళ్ల బ్యాంకు ఖాాతాలను ఫ్రీజ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. స్కామర్లు లేటెస్ట్ టెక్నాలజీ వాడినప్పటికీ నేరస్థులను పట్టుకున్నారు. ప్రస్తుతం 1.7కోట్లు బాధితురాలికి తిరిగి ఇచ్చారు. మరో రూ. 30లక్షలు చెల్లించేందుకు క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 

తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అని ఆన్ లైన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మొద్దని.. ఇలాంటివి నమ్మశక్యంగానే ఉన్నా.. జాగ్రత్తలు తీసుకోవాలని  సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు.