Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family star) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గీతగోవిందం మూవీ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. దాంతో తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు విజయ్.

ఇందులో భాగంగానే మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు ఈ హీరో. మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే రాజావారు రాణిగారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవి కిరణ్ కోలాతో సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవల్లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని, మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆ సందర్బంగా దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా ముగ్గరు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోకి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుత విజయ్, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓం పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ  సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.