​డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న స్టూడెంట్‌కు కాలేజ్ సర్‌ప్రైజ్

​డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న స్టూడెంట్‌కు కాలేజ్ సర్‌ప్రైజ్

హన్మకొండ సిటీ, వెలుగు: అసలే నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు పెద్దగా చదివించే స్థోమత లేదు. అయినా తన ఇష్టాన్ని మానుకోలేదు. ఓ వైపు ఫుడ్​డెలివరీ చేస్తూనే.. తనకు ఇష్టమైన హోటల్​ మేనేజ్​మెంట్ కోర్సులో చేరిందా యువతి. పని చేసుకుంటూనే స్టడీస్ కంటిన్యూ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె చదివే ఇనిస్టిట్యూట్​మేనేజ్​మెంట్ కోర్సుకు అయ్యే పూర్తి ఫీజును మాఫీ చేసింది. హన్మకొండ పరిధిలోని బాలసముద్రానికి చెందిన మామిడిపల్లి రవి, సాంబ కూతురు రచన. కూలి పనులు చేసుకుంటూ ఆమెను చదివించారు. పై చదువుల కోసం తల్లిదండ్రులపై భారం వేయకూడదని హైదరాబాద్​లోని వివిధ షాపుల్లో పనిచేస్తూ.. సిటీలోని చెన్నైస్​ అమిర్త ఇంటర్నేషనల్ ​ఇనిస్టిట్యూట్​లో హోటల్​మేనేజ్​ మెంట్ ​కోర్సు చేరింది. ఆన్​లైన్ ​క్లాసులకు అటెండ్​అవుతూ చదువుకొంటోంది. షాపుల్లో వచ్చే జీతం చాలకపోవడంతో జొమాటోలో ఫుడ్ డెలివరీ గర్ల్​గా చేరింది. ఆ విషయం సోషల్​ మీడియాలో వైరల్ కావడంతో తోటి విద్యార్థులు మేనేజ్​మెంట్​దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కాలేజీ యాజమాన్యం రచన చదువులకు అయ్యే రూ.75 వేల ఫీజును మాఫీ చేసింది. ఉద్యోగం సాధించే వరకు సహకారం అందిస్తామని ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఆర్.భూమినాథన్​ తెలిపారు.