తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సమావేశానికి కొన్ని షరతులను విధించింది.కేబినెట్ లో అత్యవసరమైన విషయాలను మాత్రమే మాట్లాడాలని చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వాయిదా వేయాలని షరతు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. 

ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహిం చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా..ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఈసీ అనుమతి కోరారు. అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నిర్ణ యం చెప్పకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.