కష్టపడ్డ వారికే పదవులు..సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ SC సెల్ సమావేశం

కష్టపడ్డ వారికే పదవులు..సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ SC సెల్ సమావేశం

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ సమర్థులకే పదవులు ఇస్తామని యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భువనగిరిలో ఎస్సీ విభాగం సంస్థాగత పదవులకు అప్లికేషన్లు స్వీకరించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్​మెంట్ సంస్థాగత నిర్మాణ సమీక్ష సమావేశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ పరిశీలకుడు మందుల సూర్య కిరణ్ తో కలిసి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవారిని గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు.