డిఫెన్స్‌‌‌‌ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్​కు ఐసిస్ గాలం

డిఫెన్స్‌‌‌‌ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్​కు ఐసిస్ గాలం

ట్రాప్​లో చిక్కిన కాంట్రాక్టర్​ను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశ రక్షణ రంగ వ్యవస్థను ఐసిస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ చేస్తోంది. హనీ ట్రాప్‌‌‌‌తో డిఫెన్స్‌‌‌‌ సైంటిస్టుల నుంచి రహస్యాలను లాక్కోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్​లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌‌‌‌‌‌‌‌సీఐ)–- డీఆర్డీవో ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్​ని ట్రాప్ చేసింది. ఈ విషయాన్ని ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌వోటీ, బాలాపూర్ పోలీసులు ట్రేస్‌‌‌‌ చేశారు. కాంట్రాక్ట్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. 2 మొబైల్‌‌‌‌ ఫోన్స్, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పాపయ్యరాజు పాలెంకు చెందిన దుక్క మల్లికార్జున రెడ్డి అలియాస్‌‌‌‌ అర్జున్ బిట్టు(29) ఫ్లాష్‌‌‌‌ ఫోర్జ్‌‌‌‌ కంపెనీలో క్వాలిటీ చెక్ ఇంజనీర్‌‌‌‌గా పనిచేశాడని చెప్పారు. డీఆర్డీవో ల్యాబొరేటరీకి చెందిన ప్రాజెక్టులను నిర్వహించే పఠాన్​చెరులోని క్వెస్ట్ కంపెనీలో 2018లో జాయిన్ అయ్యాడని, ప్రాజెక్ట్‌‌‌‌లపై అనుభవం రావడంతో డీఆర్డీవో కు చెందిన అడ్వాన్స్‌‌‌‌ నావెల్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌లో క్వాలిటీ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా కాంట్రాక్ట్‌‌‌‌ తీసుకున్నాడని వివరించారు. 

ఇలా ట్రాప్ చేశారు

నటాషా రావు పేరుతో ఫేస్​బుక్​లో వచ్చిన రిక్వెస్ట్​ను మల్లికార్జున యాక్సెప్ట్ చేశాడు. వాళ్లు యూకే డిఫెన్స్ జనరల్‌‌‌‌లో పబ్లిషింగ్ వర్క్స్ చేస్తున్నట్లు నమ్మించారు. మల్లికార్జున్‌‌‌‌ చేస్తున్న వర్క్‌‌‌‌తో పాటు పనిచేస్తున్న ప్రాంతం, కంపెనీ వివరాలు సేకరించారు. డీఆర్‌‌‌‌‌‌‌‌డీఎల్‌‌‌‌,ఆర్​సీఐకి సంబంధించిన సీక్రెట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున తన బ్యాంక్ అకౌంట్ల వివరాలు వాళ్లకు ఇచ్చాడు. ఇంటెలిజెన్స్‌‌‌‌ సమాచారంతో ఎస్‌‌‌‌వోటీ పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు. మీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌ త్రివేణి నగర్‌‌‌‌‌‌‌‌లోని నివాసం ఉంటున్న మల్లికార్జునను అరెస్ట్ చేశారు. ఇది ఐసిస్ హనీ ట్రాప్​గా గుర్తించారు.