10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి

10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి
  • తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్​కే ఉంది 
  • బీఆర్ఎస్ లీడర్లు పార్టీలోకి వస్తామంటే చేర్చుకోండి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ వెలుగు : చరిత్రలోనే  పదేండ్లు పాలించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే కుప్పకూలిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా ఆదివారం చౌటుప్పల్​లో మండల, మున్సిపాలిటీ బూత్​లెవెల్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్​గోపాల్​రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే..బీఆర్ఎస్​ లీడర్లు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పదే పదే అంటూ వారి పార్టే లేకుండా పోయే స్థితికి చేరుకున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేసిన ఏ లీడర్​ శిక్ష నుంచి తప్పించుకోలేరని..కాళేశ్వరం అవినీతిలో పాలు పంచుకున్న అందరూ జైలుకెళ్తారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.

భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్​గా ఇచ్చి మునుగోడుకు దండిగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో బీఆర్ఎస్ లీడర్లు ఎవరు పార్టీలోకి వస్తామన్న ఆహ్వానించాలన్నారు. ఏఐసీసీ లీడర్​ పున్న కైలాస్ నేత, మునుగోడు కో ఆర్డినేటర్ బొజ్జ సంధ్యారెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ, నాయకులు  పబ్బు రాజు గౌడ్, మొగుదాల రమేశ్​ పాల్గొన్నారు.