యాదాద్రి జిల్లా ఆలేరులో కార్డన్ సెర్చ్

యాదాద్రి జిల్లా ఆలేరులో కార్డన్ సెర్చ్

ఆలేరు (యాదాద్రి), వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున డీఎస్పీ శ్రీనివాస్​ నాయుడు ఆధ్వర్యంలో ఇన్​స్పెక్టర్లు,ఎస్​ఐలు, ఎస్​వోటీ, ఆర్మ్​ రిజర్వ్​ స్టాఫ్​ కలిపి మొత్తంగా 200 మంది ఆయుధాలతో పోచమ్మ గుడి ఏరియాకు చేరుకొని భారత్​నగర్, రఘునాథ్​పూర్​ రోడ్డుపై ఇండ్లలో కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు.

ఇద్దరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్​ ఇచ్చారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి వివరాలు సేకరించారు. 50 లీటర్ల అక్రమ లిక్కర్, పత్రాలు లేని 8 గ్యాస్​ సిలిండర్లు, 31 టూ వీలర్లు, కార్లు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.