కరోనా జబ్బు కాదు.. ఇది అంతం కావాలంటే ఒక్కటే మార్గం: సమాజ్‌వాదీ ఎంపీ

కరోనా జబ్బు కాదు.. ఇది అంతం కావాలంటే ఒక్కటే మార్గం: సమాజ్‌వాదీ ఎంపీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి జబ్బు కాదని అన్నారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రెహ్మాన్. ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మందు లేదంటేనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారాయన. కరోనా మహమ్మారి దేవుడు విధించిన శిక్ష అని, దీన్ని పోగొట్టుకునేందుకు ఉన్న ఒకే మార్గం అందరం దేవుడిని ప్రార్థించడమేనని అన్నారు. ఆదివారం ఆయన ఉత్తరప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడారు.

‘ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మందు లేదు. దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. మనం చేసిన పాపాలకు దేవుడు విధించిన శిక్షే కానీ ఇది వ్యాధి కాదు. కాబట్టి దీనికి క్యూర్ చేసుకునేందుకు ఉన్న ఉత్తమ మార్గం మనం అందరం దేవుడిని ప్రార్థించడమే. ఈ నెల 31న రాబోయే బక్రీద్ పండుగ నాడు అన్ని మార్కెట్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చి గొర్రెలను కొనేందుకు వీలు కల్పించాలి. కరోనా వైరస్‌ అంతం కోసం ప్రజలు ప్రార్థనలు చేసేందుకు మసీదులు, దర్గాలు ఓపెన్ చేయాలి. ప్రజలు వచ్చి ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు ఎంపీ రెహ్మాన్.