కేంద్రం చెప్పులపై జీఎస్టీ వేయడం సిగ్గుచేటు

కేంద్రం చెప్పులపై జీఎస్టీ వేయడం సిగ్గుచేటు

కేంద్ర ప్రభుత్వం  చెప్పులపై   5 నుంచి 12 శాతం  పన్ను పెంచటం సిగ్గుచేటని   అన్నారు  సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ. తాను స్థాయికి  తగ్గి మాట్లాడుతున్నానని  బీజేపీ విమర్శించడం హాస్యాస్పదంగా  ఉందన్నారు.  కమ్యూనిస్టు  పార్టీల స్థాయి... సామాన్యులకు  అనుకూలంగా  ఉంటుందన్నారు. సామాన్యుల నుంచి వ్యతిరేకత  మొదలైనప్పుడు ... మతం పేరుతో  రెచ్చగొట్టడం  కరెక్ట్ కాదన్నారు. చారిత్రక కట్టడాలును కూల్చేస్తాం అని మాట్లాడటం కరెక్ట్ కాదని సూచించారు.  జిన్నా టవర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి..  బ్రిటిష్ వాళ్లు కట్టిన రైల్వే బ్రిడ్జిలను, ప్రభుత్వ ఆసుపత్రులను, నిజాం నిర్మించిన గోల్కొండ కోటను కూడా కూల్చేయగలరా? అని ప్రశ్నించారు నారాయణ. 

 

పంచాయితీలు నా వల్ల కాదు

అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు