అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు

అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు

కొత్త ఏడాదికి ఎంతో గ్రాండ్‌గా వెల్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ చెబుతాం. కానీ చేదు జ్ఞాపకాలు మిగిల్చిన పాత ఏడాదిని అంత ఈజీగా మర్చిపోలేం. హీరోయిన్‌‌‌‌‌‌‌‌ సమంత పర్సనల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లోనూ లాస్ట్ ఇయర్ అలాంటి ఓ చేదు జ్ఞాపకం. అయితే చాలా త్వరగా ఆ ప్రభావం నుంచి బయటపడిందామె. తన సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా పోస్టుల్లో ఆ విషయం అర్థమవుతుంటుంది. ఇటీవల ఇన్‌‌‌‌‌‌‌‌ స్టా స్టోరీలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘‘ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్లేం నమ్ముతున్నారు, వాళ్లు ఆశించేదేంటి.. ఇవన్నీ కూడా జైలుకి ఉండే ఊచలు లాంటివి. ఆ జైలు నుంచి బయటపడాలంటే.. ఊచలు ఉన్నవి వాళ్ల మనసులకే తప్ప మీకు కాదని గ్రహించాలి. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఎవరి ఒపీనియనూ మేటర్ కాదు.. నిజం ఒక్కటే మేటర్. ఒంటరిగా ఉన్నా కూడా నిజమైన వ్యక్తిత్వంతో ఉంటే ఎవరి ప్రశంసలూ అవసరం లేదు. ఇవన్నీ ఓ సారి అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా మీరు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు.. అంతేకాదు గతంలో కంటే ఎక్కువ గౌరవాన్ని  పొందుతారు’ అంటూ లెంగ్తీ పోస్ట్ చేసింది సమంత. ఇక న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంత పెద్ద అచీవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ని అయినా సింపుల్‌‌‌‌‌‌‌‌గా స్టార్ట్ చేసేయండి అంటూ టార్గెట్స్ విషయంలో పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా రియాక్ట్ అయింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా ఫినిష్ చేసిన సమంత, మరోవైపు ‘యశోద’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘కాత్తువాకల రెండు కాదల్‌‌‌‌‌‌‌‌’తో పాటు మరో కొత్త సినిమాకు సైన్ చేసింది.