బలపడుతున్న ఫని తుపాను

బలపడుతున్న ఫని తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైందన్నారు.. వాతావరణశాఖ అధికారులు. ఇది తీవ్ర తుఫానుగా మారి.. అతి తీవ్ర తుఫానుగా బలపడనుందన్నారు. ఈ నెల 30న సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా వస్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయువ్య దిశగా 7 కి.మీ వేగంతో తుపాను కదులుతోందని.. మరో 12 గంటల్లో ఫొని తీవ్ర తుపానుగా మారనుందన్నారు. ప్రస్తుతం ట్రింకోమలికి 745 కి.మీ దూరంలో, చెన్నైకి 1,050 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నంకు 1,230 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. 24 గంటల్లో బలపడి ఫని పెను తుపానుగా మారనుందంటున్నారు.