టైటాన్స్‌‌కు మూడో ఓటమి

టైటాన్స్‌‌కు మూడో ఓటమి

హైదరాబాద్‌‌‌‌:సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌‌‌‌ వరుస పరాజయాల పరంపర వేట కొనసాగుతూనే ఉన్నది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఓడి.. తొలి గెలుపు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నది. బుధవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ దబాంగ్‌‌‌‌ కేసీ 34–33తో టైటాన్స్‌‌‌‌పై నెగ్గింది. గత రెండు మ్యాచ్‌‌‌‌లతో పోలిస్తే ఈసారి తెలుగు జట్టు ఫెర్ఫామెన్స్‌‌‌‌ కాస్త మెరుగైంది.  టైటాన్స్‌‌‌‌ తరఫున సూరజ్‌‌‌‌ రైడింగ్‌‌‌‌లో అదరగొట్టినా ప్రయోజనం లేకపోయింది. 15 సార్లు రైడ్‌‌‌‌ అంటెప్ట్‌‌‌‌ చేసిన సూరజ్‌‌‌‌ 18 పాయింట్లు సాధించాడు. ఫలితంగా పీకేఎల్‌‌‌‌ అరంగేట్రంలో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. డిఫెన్స్‌‌‌‌లో విశాల్‌‌‌‌ భరద్వాజ్‌‌‌‌ పట్టు సరిపోలేదు. ఏడు ట్యాకిల్‌‌‌‌ అటెంప్ట్స్‌‌‌‌లో 4 పాయింట్లు సాధించాడు. ఢిల్లీ జట్టులో నవీన్‌‌‌‌ ఆకట్టుకున్నాడు. 20 రైడింగ్స్‌‌‌‌లో 14 పాయింట్లు సాధించి టీమ్‌‌‌‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్యాకిలింగ్‌‌‌‌లో జోగిందర్‌‌‌‌ నర్వాల్‌‌‌‌ నాలుగు అటెంప్ట్స్‌‌‌‌లో 4 పాయింట్లు తీసుకొచ్చాడు. టాస్‌‌‌‌ గెలిచిన ఢిల్లీ.. కోర్టును ఎంచుకోగా, టైటాన్స్‌‌‌‌ కూతకు వెళ్లింది.

హోరాహోరీ..

ఆరంభం నుంచి మెరుగ్గా ఆడిన టైటాన్స్‌‌‌‌కు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రతి పాయింట్‌‌‌‌ కోసం ఢిల్లీ హోరాహోరీగా పోరాడింది.  రైడింగ్‌‌‌‌, డిఫెన్స్‌‌‌‌లో రాణించిన టైటాన్స్‌‌‌‌ తొలి 10 నిమిషాల్లో 8–7తో ముందంజ వేసింది. ఢిల్లీ తరఫున నవీన్‌‌‌‌ ఎక్కువగా రైడింగ్‌‌‌‌ చేయడం కలిసొచ్చింది. దీంతో ప్రతి నిమిషానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఫస్ట్‌‌‌‌ హాఫ్‌‌‌‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా నవీన్‌‌‌‌ రైడింగ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ తేవడంతో ఢిల్లీ 13–12తో ముగించింది. రెండో హాఫ్‌‌‌‌లో  సిద్ధార్థ్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ డూ ఆర్‌‌‌‌ డై రైడింగ్‌‌‌‌లో పాయింట్లు కొల్లగొట్టి తెలుగు టీమ్‌‌‌‌ను 15–14, 17–16, 20–18 ఆధిక్యంతో నిలిపాడు. కానీ ఈ దశలో రైడింగ్‌‌‌‌కు వెళ్లిన సిద్ధార్థ్‌‌‌‌ను జోగిందర్‌‌‌‌ ట్యాకిల్‌‌‌‌ చేయడంతో టైటాన్స్‌‌‌‌ ఆలౌటైంది. దీంతో స్కోరు 21–21తో సమమైంది. ఇక ఇక్కడి నుంచి మ్యాచ్‌‌‌‌ మొత్తం సూరజ్‌‌‌‌, నవీన్‌‌‌‌ మధ్య పోరాటంగా సాగింది. నువ్వా–నేనా అన్నట్లు పాయింట్లు కొల్లగొట్టడంతో ఇరుజట్లు ఒకటి, రెండు పాయింట్ల ఆధిక్యంతో ముందుకెళ్లాయి. ఇక  స్కోరు 34-–32 ఉన్న దశలో రైడింగ్‌‌‌‌కు వెళ్లిన సూరజ్‌‌‌‌ ఒక్క పాయింట్‌‌‌‌ తేవడంతో టైటాన్స్‌‌‌‌కు ఓటమి తప్పలేదు.

బెంగాల్‌‌‌‌ అదుర్స్‌‌‌‌..

మరో మ్యాచ్‌‌‌‌లో బెంగాల్‌‌‌‌ వారియర్స్‌‌‌‌ 48–17తో యూపీ యోధాపై రికార్డు విజయాన్ని నమోదు చేసింది. పీకేఎల్‌‌‌‌లో మార్జిన్‌‌‌‌ పరంగా ఇదే అతిపెద్ద విక్టరీ. బెంగాల్‌‌‌‌ ఆటగాళ్లు మణిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (9), మహ్మద్‌‌‌‌ నబీబాక్స్‌‌‌‌ (10) యూపీ డిఫెన్స్‌‌‌‌ను ఛేదించారు. ట్యాకిలింగ్‌‌‌‌లో బల్దేవ్‌‌‌‌ సింగ్‌‌‌‌ 7 పాయింట్లతో రాణించాడు. యూపీకి మోను గోయట్‌‌‌‌ 6 పాయింట్లు అందించాడు. తొలి 10 నిమిషాల్లో ఇరుజట్లు 6–6తో సమంగా నిలిచినా.. తర్వాత వారియర్స్‌‌‌‌ ఒక్కసారిగా గేర్‌‌‌‌ మార్చింది. కేవలం 13 నిమిషాల్లోనే ఆధిక్యాన్ని 13–7కు పెంచుకుంది. అదే జోరుతో 17–9తో ఫస్ట్‌‌‌‌ హాఫ్‌‌‌‌ను ముగించింది. రెండో హాఫ్‌‌‌‌లో సమిష్టిగా చెలరేగిన బెంగాల్‌‌‌‌ వరుస
పాయింట్లతో ఆధిక్యాన్ని 22–10, 25–11, 30–12, 33–13కు తీసుకెళ్లింది. 37వ నిమిషంలో యూపీని నాలుగోసారి ఆలౌట్‌‌‌‌ చేసిన బెంగాల్‌‌‌‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.