నల్లటి మేఘాల్లో బ్యాక్టీరియా..ప్రమాదమా..

 నల్లటి మేఘాల్లో బ్యాక్టీరియా..ప్రమాదమా..

ఆకాశం మేఘావృతం అయ్యిందంటే వర్షం రాబోతుంది అని అర్థం. కొన్ని సార్లు మేఘాలు నల్లగా మారితే భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తాం. కానీ ఆ నల్లటి మేఘాలు మనుషులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా...అవి అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాను  వెదజల్లుతాయని తెలుసా...

అధ్యయనంలో ఏ తేలింది...

వర్షంలో భారీగా బ్యాక్టీరియా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్, కెనడాకి చెందిన సైంటిస్టులు ఈ నల్లమబ్బులపై లోతైన పరిశోధనలు చేశారు.  2019 సెప్టెంబర్‌ నుంచి -2021 అక్టోబర్‌ మధ్య  ఫ్రాన్స్ మధ్యలోని ఫుయెడెడోమ్ అగ్నిపర్వతం దగ్గర్లో ... సముద్ర మట్టానికి 4,806 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన వాతావరణ పరిశోధనా కేంద్రం....నల్ల మబ్బుల్లోని నీటి అణువుల శాంపిల్స్ సేకరించింది.  వీటిని విశ్లేషించగా మిల్లీ లీటర్‌ క్లౌడ్‌ వాటర్‌కు 330 నుంచి 30 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.  సగటున ఒక మిల్లీమీటర్ నీటిలో 8వేల రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు.  వీటిలో 29 రకాల బ్యాక్టీరియా.... యాంటీ బయోటిక్ మందులను తట్టుకుంటోందని తేల్చారు. తమ పరిశోధన ఫలితాల్ని ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ అనే సైన్స్ జర్నల్‌ మార్చి ఎడిషన్‌లో శాస్త్రవేత్తలు  ప్రచురించారు.

మనుషులకు ఏ విధంగా ప్రమాదం..

మేఘాల్లో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే జన్యువులు ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి వాటి జన్యువుల్లో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల మేఘాలకు ఆ శక్తి వచ్చినట్లు తేలింది. అలా బ్యాక్టీరియాతో నిండిన నల్లని మబ్బుల ద్వారా వర్షం కురిసినప్పుడు ఆ బ్యాక్టీరియా నేలపైన పడుతుంది. అలా బ్యాక్టీరియా పాడిపంటలపైన పడి మనుగడ సాగిస్తుంది. వాతావరణ పరిస్థితులవల్ల నల్లని మేఘాలు భూవాతావరణంలో చేరిన తర్వాత ఎక్కడికైనా వెళ్తాయి. అందువల్ల ప్రమాదకర బ్యాక్టీరియా పాకిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా ఔషధాలకు లొంగని బ్యాక్టీరియా అని చెప్పారు. దీని వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లితుందని  హెచ్చరించారు. నల్లని మేఘాల్లో నక్కిన బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం వరకే జీవిస్తున్నాయంటున్నారు.  ప్రజల ఆరోగ్యంపై ఈ బ్యాక్టీరియా ఎంతమేర ప్రభావితం చేస్తాయన్న విషయంలో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాతావరణ సంబంధిత బ్యాక్టీరియా వల్ల మనుషులకు పెద్ద ప్రమాదం ఉందని చెబుతున్నారు. నల్ల మేఘాల ద్వారా వాన కురుస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.