ఎస్సీ స్టడీ సర్కిల్​లో ఉచితంగా సివిల్స్ కోచింగ్

ఎస్సీ స్టడీ సర్కిల్​లో ఉచితంగా సివిల్స్ కోచింగ్

ఎల్​బీనగర్, వెలుగు:  సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్​లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల గడువు జులై 2తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జులై 9న రాత పరీక్షను హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ లో నిర్వహిస్తామన్నారు. 

ఈ పరీక్ష ద్వారా వంద మందిని ఎంపిక చేస్తామని అందులో 75 సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి, 15 సీట్లు వెనుకబడిన తరగతుల వారికి, 10 సీట్లు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో 33.33 శాతం మహిళలకు, 5 శాతం దివ్యాంగులకు చెందుతాయన్నారు. 10 నెలల పాటు కోచింగ్ ఉంటుందని.. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్​అయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. www.tsstudycircle.co.in వెబ్​సైట్​లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.