
నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నవీన్ చంద్రకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆయన నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.