కరోనా భయంతో ప్రైవేట్ వెహికిల్స్ కు గిరాకీ

కరోనా భయంతో  ప్రైవేట్ వెహికిల్స్ కు గిరాకీ

సంక్రాతి పండుగ సందర్భంగా సొంతూళ్ల బాట పట్టారు జనం.  ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్ నుంచి వెళ్లారు. అయితే కరోనా ప్యాండెమిక్ వల్ల.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కన్నా సొంత వాహనాలు, రెంటల్ కార్స్ ను బుక్ చేసుకుంటున్నారు. ట్రైన్లు, బస్సుల్లో చార్జీల మోత, కరోనా భయంతో ప్రైవేట్ వెహికిల్స్ కు గిరాకీ పెరిగింది. సంక్రాంతి ఫెస్టివల్, లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో చాలా మంది హైదరాబాద్ నుంచి టూర్స్ కి వెళ్తున్నారు. ఇప్పటికే నగరం నుంచి సొంతూళ్ళకు పెద్ద ఎత్తున వెళ్లిపోయారు. బస్ లు, ట్రైన్ల లో ప్రయాణాల కంటే.... ఫ్యామిలీతో కలిసి విడిగా వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. ఓన్ వెహికిల్ లేదంటే సెల్ఫ్ డ్రైవింగ్ కోసం వెహికిల్స్ అద్దెకు తీసుకుంటున్నారు.  సొంతూళ్ళకు వెళ్ళలేని వారు హైదరాబాద్ చుట్టు పక్కల టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్తున్నారు. కిలోమీటర్లతో పాటు వెహికల్ ను బట్టి చార్జెస్ వసూలు చేస్తున్నారు  రెంటల్ కాబ్స్ నిర్వాహకులు.

కొన్ని సంస్థలు డ్రైవర్ తో సహా వెహికిల్స్ ఇస్తున్నాయి.  మరికొన్ని కంపెనీలు.. ఐడీ ప్రూఫ్స్, అడ్వాన్స్ పేమెంట్స్ తో కస్టమర్లకు నచ్చిన వెహికిల్స్ ఇస్తున్నాయి. 5 సీటర్స్, 7 సీటర్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు పెద్ద వెహికిల్స్ కి కూడా మంచి డిమాండ్ ఉందంటున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్ లైన్ క్లాసులతో బిజీగా గడిపిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస, పిల్లలు ... ఈ సెలవుల్లో బయటకు వెళ్లి రిలాక్స్ అయ్యేందుకు మినీ ట్రిప్స్ కి ప్లాన్ చేస్తున్నారు. కొందరు టూరిజం స్పాట్స్ కు వెళ్తున్నట్టు చెబుతున్నారు ట్రావెల్స్ నిర్వాహకులు. పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది చాలా మంది హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రయాణ ఖర్చుల మోత, కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తితో చాలా మంది బయటకు రావట్లేదు. ప్రతి యేడాది కంటే ఈసారి కాస్త రెంటల్ వెహికిల్స్ కు డిమాండ్ తగ్గిందనే చెబుతున్నారు ప్రైవేట్ క్యాబ్ సంస్థలు.