అద్భుత నిర్మాణం : తోటగా మారిన ఎడారి

అద్భుత నిర్మాణం : తోటగా మారిన ఎడారి

నిన్న మొన్నటి వరకు దాదాపుగా అదో ఎడారి ప్రాంతం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని షార్జా సిటీ శివారుల్లో ఉన్న ఎందుకూ పనికిరాని భూమి. ఇప్పుడు ఆ ప్రాంతం రూపమే మారిపోయింది. ఎడారి ప్రాంతంలో ఓ అద్భుత నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణమే  ప్రస్తుతం అక్కడ ఓ పెద్ద టూరిస్టు స్పాట్​లా తయారై అందరినీ ఆకట్టుకుంటోంది.

వసీత్ నేచురల్ రిజర్వ్… షార్జా వాసులకు ఇప్పుడు ఎంతో ఇష్టమైన టూరిస్టు స్పాట్ ఇది. వీకెండ్స్ వస్తే చాలు సిటీలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ  నేచురల్ రిజర్వ్​కు వెళ్తున్నారు. చదరపు కిలోమీటరు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండే ఈ రిజర్వ్  ప్రస్తుతం ఓ మంచి బర్డ్ శాంక్చువరీగా పాపులర్ అయింది. ఇక్కడ 350 జాతులకు పైగా పక్షులుంటాయి. వీటిలో వేరే ప్రాంతాల నుంచి వలసవచ్చిన పక్షులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

20 ఏళ్ల కిందట..

షార్జా శివార్లలో కొన్నేళ్ల కిందట దాదాపు 20 ఎకరాల భూమి ఎందుకూ పనికి రాకుండా పడిఉండేది. ఈ భూమిపై అప్పటి షార్జా సుల్తాన్ ఫోకస్ పెట్టాడు. ఖాళీగా పడిఉన్న జాగాను అభివృద్ధి చేసే పనిని అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం 2000లో మొదలెట్టింది. అసలు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కుదిరే పనేనా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా షార్జా సుల్తాన్  ఓ సర్వే  చేయించాడు. సర్వే పాజిటివ్​గా రావడంతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2007లో ఈ ప్రాంతానికి ‘ప్రొటెక్టెడ్ స్టేటస్’ ప్రకటించాడు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే  బాధ్యతను ‘ఎక్స్ ఆర్కిటెక్ట్స్’ అనే సంస్థకు
అప్పగించారు.

ఎడారి ప్రాంతంలో నీటికయ్యలు

ఎడారి వంటి ఖాళీ జాగాలో అక్కడక్కడా నీటి కయ్యలతో పాటు నాచు కూడా ఉన్నట్లు  ‘ఎక్స్’ ఆర్కిటెక్ట్స్ సంస్థ గుర్తించింది. ముందుగా ఈ ఏరియా మొత్తాన్ని శుభ్రం చేయించి, మొత్తం 35,000 మొక్కలను నాటింది. యూఏఈలో సహజంగా వానలు తక్కువగా పడతాయి. గ్రౌండ్ వాటర్ కూడా తక్కువగానే ఉంటుంది. 15 వెల్ పాయింట్స్​ను గుర్తించి తవ్వడంతో గ్రౌండ్ వాటర్ వినియోగంలోకి వచ్చింది. ఆ నీళ్లను మొక్కలకు  అందించింది. ఈ కొద్దిపాటి నీళ్లే మొక్కలకు ఆధారమయ్యాయి. మొక్కలు బతికాయి. మొక్కలకు రక్షణగా ఖాళీ జాగా చుట్టూ  ఓ పెద్ద గోడ కట్టారు.  20 ఎకరాల  ఖాళీ జాగాను అద్భుతంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ కావడంతో షార్జా పాలకుల దృష్టి  ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్టులపై పడింది. మరిన్ని నేచురల్ రిజర్వులను డెవలప్ చేయడంపై నజర్ పెట్టింది. బర్డ్ శాంక్చురీలను మరింతగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. చిన్నారులకు వసీత్ నేచురల్ రిజర్వ్ ఓ ఇన్ స్పిరేషన్ గా ఉంటుందన్నారు పర్యావరణవేత్తలు.

ఆగా ఖాన్ అవార్డ్ 

షార్జాలో మేజర్ టూరిస్టు స్పాట్గా నిలిచిన వసీత్ నేచురల్ రిజర్వ్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డు ‘ఆగా ఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డ్’ గెలుచుకుంది. ఆగా ఖాన్ పేరుతో  1977లో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ప్రతి మూడేఉళ్లకోసారి ఇస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ముఖ్యంగా పర్యావరణాన్ని  దృష్టిలో పెట్టుకుని చేసే నిర్మాణాలకు ఈ అవార్డు ఇస్తారు. భవిష్యత్ తరాలకోసం రూపొందించే ఇన్నోవేటివ్ బిల్డింగ్ కాన్సెప్ట్లను ప్రోత్సహించడమే ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం.