Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్

Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double Ismart). టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut) విల్లన్ చేస్తున్నారు. 2019లో వచ్చిన ఇస్మార్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న  సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచాలున్నాయి. అంతేకాదు.. ఈసారి ఇస్మార్ట్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కస్తుండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. మే 15న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. టీజర్ విడుదలకు ఒకరోజు ముందు టీజర్ డీటెయిల్స్ చెప్తూ మరో అప్డేట్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. అదేంటంటే.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ డ్యూరేషన్ 85 సెకన్లు ఉండనుందట. అది కూడా ఫస్ట్ పార్ట్ కి మించి మాస్ ఎలిమెంట్స్ తో రానుందట ఈ టీజర్. దాంతో రామ్ ఫ్యాన్స్ టీజర్ పట్ల ఫుల్ ఆసక్తిగా ఉన్నారు. రేపు టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో రచ్చ లేపాలని ఫిక్స్ అవుతున్నారు. 

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే.. పార్ట్ 1 కి మించి ఈ సినిమా విజయం సాదిస్తుందని రామ్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.