దిశ నిందితుల డెడ్ బాడీలు 50% డీ కంపోజ్

దిశ నిందితుల డెడ్ బాడీలు 50% డీ కంపోజ్

దిశపై హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ ముందు గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్ హాజరయ్యారు. మృతదేహాలు 50శాతం డీ కంపోజ్ అయ్యాయని తెలిపారు. మైనస్ 2 నుంచి మైనస్ 4 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్ లో నాలుగు మృతదేహాలను ప్రీజర్‌లో ఉంచామని తెలిపారు. ఇంకా డెడ్ బాడీస్ ప్రీజర్‌లలో ఉంటే వారం రోజుల్లో పూర్తిగా 100%  డీ కంపోజ్ అయ్యే అవకాశముందన్నారు.

దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరచడానికి ఫెసిలిటి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి తెలియదని శ్రవణ్ బదులిచ్చారు. డిసెంబర్ 9 న మృతదేహాలను గాంధీకి తీసుకొచ్చారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. మొదట మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యుల వివరాలను ఏజీ కోర్టుకు తెలిపారు.