మొదటి సారి ఆ గ్రామాల్లో విద్యుత్ వెలుగులు

మొదటి సారి ఆ గ్రామాల్లో విద్యుత్ వెలుగులు

మొదటి సారిగా విద్యుత్ వెలుగులను చూస్తున్నారు ఆ గ్రామస్థులు. దేశానికి స్వాతంత్ర్యపు వెలుగులు వచ్చినా…అప్పటి నుంచి కరెంటు వెలుతురు మాత్రం రాలేదు. ఇప్పటి వరకు కరెంట్ అంటే ఏలా ఉంటుందో తెలియని అక్కడి జనం… ఇన్నేళ్ల తర్వాత విద్యుత్ రావడంతో ప్రస్తుతం పండుగ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు జమ్ము కశ్మీర్ లోని ఓ మారుమూల ప్రాంతంలోని పరిస్థితి.

రాజౌరి జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి ఆ గ్రామాల్లో వెలుగులు నిండాయి. సుమారు 20 వేల ఇళ్లు ప్రస్తుతం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. 1947 నుండి ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో కేంద్రం చొరవ తీసుకొని ‘సౌభాగ్య’ పథకం కింద అక్కడి గ్రామాలకు కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇంత కాలం విద్యుత్ లేక ఈ ప్రాంతాలన్ని పూర్తిగా వెనకబడిపోయాయి. లాంతర్ల వెలుగుల్లోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. పిల్లల చదువులు కూడా సరిగా జరిగేవి కాదు. ప్రస్తుతం తమ ఇళ్లలోకి కరెంట్ రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం దేశంలో కరెంట్ లేని గ్రామాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ‘సౌభాగ్య’ అనే కొత్త పథకాన్ని 2017 సెప్టెంబర్ 25 న ప్రధాని మోడీ ప్రారంభించారు.