ఏ ఎమోజీని ఎక్కువగా వాడుతున్నారో తెలుసా?

ఏ ఎమోజీని ఎక్కువగా వాడుతున్నారో తెలుసా?

ఇంటర్నెట్ కన్వర్జేషన్స్‌‌లో ఎమోజీలకున్న స్పెషాలిటీనే వేరు. దాదాపు ప్రతీ ఎక్స్‌‌ప్రెషన్​కి ఒక ఎమోజీ ఉంటుంది కూడా. లాక్​డౌన్​ టైంలో ఇంటిపట్టునే ఉండటం, కాస్త ఖాళీ టైం దొరకడంతో ఎమోజీల, స్టిక్కర్ల వాడకం బాగా పెరిగింది. కరోనాను ముడిపెట్టి, సరదాగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుండటం మరో విశేషం. అయితే ఏ ఎమోజీని ఎక్కువగా వాడుతున్నారో తెలుసా?

ఎమోజీపీడియా సర్వే ప్రకారం.. ‘ఫేస్‌‌ విత్‌‌ టియర్స్‌‌ ఆఫ్‌‌ జాయ్‌‌, మెడికల్ మాస్క్‌‌,  థింకింగ్‌‌ ఫేస్‌‌, మైక్రోబ్ ఎమోజీ’లను ఎక్కువగా వాడుతున్నారు. ఎమోజీల స్కేల్‌‌(2000కిగానూ)లో ఫేస్‌‌ విత్‌‌ టియర్స్‌‌, 1800 మార్క్‌‌ క్రాస్‌‌ చేయగా, ఫేస్‌‌ విత్‌‌ టియర్స్‌‌(క్రాస్‌‌ వెర్షన్‌‌) రెండో ప్లేస్‌‌లో ఉంది. మాస్క్‌‌, థింకింగ్‌‌, మైక్రోబ్‌‌, క్రైయింగ్‌‌ ఎమోజీలు తర్వాతి ప్లేస్‌‌లో ఉన్నాయి. మరోవైపు ఇటలీ, చైనా, యూఎస్‌‌ఏ, ఫ్రాన్స్‌‌, స్పెయిన్ జెండాలకు సంబంధించిన ఎమోజీలు బాగా స్ప్రెడ్‌‌ అయ్యాయి. మిగతా ఎమోజీస్‌‌లో ‘ఫేస్‌‌ వాంటింగ్‌‌, స్నీజింగ్‌‌(చీదినట్లుండే) ఎమోజీ, ఫేస్‌‌ విత్ హెడ్‌‌ బ్యాండేజ్‌‌, అంబులెన్స్‌‌, సిరంజి, సోప్‌‌, స్పాంజ్‌‌’ ఎమోజీలు కూడా బాగా వాడేశారు.