డాట్‌‌కు గెయిల్‌ బాకీ లక్షా 72 వేల కోట్లు

డాట్‌‌కు గెయిల్‌ బాకీ లక్షా 72 వేల కోట్లు

వ్యాపారమే చేయలేదని, ఆ మొత్తం చెల్లిం చక్కర్లేదని గెయిల్‌ వాదన
రూ. 1.25 లక్షల కోట్లు కట్టమంటూ పవర్‌ గ్రిడ్‌‌కూ డాట్‌ లెటర్‌

లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌‌‌‌ బకాయిలు రూ. 1.72 లక్షల కోట్లు చెల్లించాలని ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌‌‌‌ ఇండియాపై డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టెలికం పెద్ద పిడుగే వేసింది. ఐతే, ఈ పిడుగును తట్టుకునే పరిస్థితి గెయిల్‌‌‌‌ ఇండియాకు ఏమాత్రం లేదు. గెయిల్‌‌‌‌ ఇండియాను మూడు సార్లు అమ్మినా  ఆ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదు. ఇదేవిధంగా రూ. 1.25 లక్షల కోట్ల బకాయిలు చెల్లించమంటూ డాట్‌‌‌‌ మరో పీఎస్‌‌‌‌యూ పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌కు కూడా తాఖీదు పంపింది. గతంలో ఎప్పుడో ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ సంబంధ సేవలు అందించేందుకు గెయిల్‌‌‌‌ ఇండియా, పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌లు ఈ లైసెన్సులు తీసుకున్నాయి. కానీ, పెద్దగా వ్యాపారమేమీ చేయలేదు. ఇప్పుడు డాట్‌‌‌‌ సడెన్‌‌‌‌గా బకాయిలు చెల్లించమని కోరడంతో గెయిల్‌‌‌‌ ఇండియా, పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌లు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

టెల్కోలు కట్టాల్సింది రూ. 1.47 లక్షల కోట్లు..

ప్రభుత్వం అనుమతి ఇచ్చిన స్పెక్ట్రమ్‌‌‌‌ లేదా ఎయిర్‌‌‌‌వేవ్స్‌‌‌‌ ఉపయోగించుకుని సంపాదించిన నాన్‌‌‌‌–టెలికం ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని గత కాలపు బకాయిలను లెక్కకట్టాలని ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ లైసెన్సు, స్పెక్ట్రమ్‌‌‌‌ వాడుకుని నాన్‌‌‌‌–టెలికం ఆదాయం ఆర్జించిన  కంపెనీల జాబితాలో భారతి ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, వొడాఫోన్‌‌‌‌ ఐడియా వంటి టెల్కోలు ఉన్నాయి. కానీ, గెయిల్‌‌‌‌ లాంటి కంపెనీలకు అలాంటి నాన్‌‌‌‌–టెలికం ఆదాయాలేవీ లేవు. ఇక టెల్కోల నుంచైతే మొత్తం రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల చెల్లింపును డాట్‌‌‌‌ కోరుతోంది. గెయిల్‌‌‌‌ ఇండియా నుంచే కాకుండా మరో పీఎస్‌‌‌‌యూ  పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌ నుంచి కూడా తమకు రూ. 1.25 లక్షల కోట్లు రావాలని డాట్‌‌‌‌ చెబుతోంది. నేషనల్‌‌‌‌ లాంగ్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌, ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ లైసెన్సులను పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌ అప్పట్లో తీసుకుంది. ఐతే, 2006–07 నుంచి చూస్తే, తమ ఎడ్జస్టెడ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌‌‌) రూ. 3,566 కోట్లని, దానికి పెనాల్టీ కలిపితే రూ. 22,168 కోట్లవుతుందని పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌ పేర్కొంది. టెలికం సర్వీసులు అందించే కంపెనీలకు డార్క్‌‌‌‌ ఫైబర్‌‌‌‌, రైట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వే, డక్ట్‌‌‌‌ స్పేస్‌‌‌‌, టవర్స్‌‌‌‌ వంటి ఆస్తులు అందించే వాటిని ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ప్రొవైడర్స్‌‌‌‌ (ఐపీ)–1 గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా గ్యాస్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్లున్న గెయిల్‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌ థర్డ్‌‌‌‌ పార్టీలకు బ్యాండ్‌‌‌‌విడ్త్‌‌‌‌ అందించే ఉద్దేశంతో  పైప్‌‌‌‌లైన్‌‌‌‌ పొడవునా ఆప్టిక్‌‌‌‌ ఫైబర్‌‌‌‌ వేసింది. ఇక ఐపీ–2 లైసెన్సు జారీ విధానాన్ని 2005 లోనే మార్చేశారు.

రూ.లక్ష కోట్ల వరకు చెల్లించాలి

టెలికం ఆపరేటర్లు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 31 నాటికి, తమకు  చెల్లించాల్సిన స్పెక్ట్రమ్‌‌‌‌ యూసేజ్‌‌‌‌ బకాయిలు రూ. 55,054.51 కోట్లని డాట్‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది కాకుండా లైసెన్స్‌‌‌‌ ఫీజు బకాయిలు మరో రూ. 92,642 కోట్లని డాట్‌‌‌‌ లెక్కకట్టింది.ప్రభుత్వ విభాగమైన డాట్‌‌‌‌, ప్రభుత్వ రంగ సంస్థలయిన గెయిల్‌‌‌‌ ఇండియా, పవర్‌‌‌‌గ్రిడ్‌‌‌‌ల మధ్య మొదలైన ఈ చెల్లింపుల వివాదం ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

సుప్రీమ్‌ తీర్పుతో ….
లైసెన్సు ఫీజులు, స్పెక్ట్ర మ్‌ ఛార్జీల లెక్కింపు విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏజీఆర్‌‌‌‌ లెక్కిం పు ఇలా చేయాలంటూ అందులో సూచించింది. ఆ తీర్పు ఆధారంగా చేసుకున్న డాట్‌ , కిందటి నెలలో ఈ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. మూడు నెలల్లోగా ఈ రూ. 1,72,655 కోట్ల బకాయిలను చెల్లించాల్సిందిగా ఆ నోటీసులో కోరారు. ఐతే, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికే చెల్లించేశామని, ఇంక చెల్లిం చాల్సిందేమీ లేదని గెయిల్‌ ఇండియా వాదిస్తున్నట్లు సమాచారం. 2002 లో తాము 15 ఏళ్ల కాలానికి ఐఎస్‌ పీ లెసెన్సును పొందామని, ఆ లైసెన్సు కాలపరిమితి 2017 తో ముగిసిపోయిందని కూడా లెటర్ రాసింది. ఆ లైసెన్సుతో తాము ఎలాంటి వ్యాపారమూ చేయలేదని కూడా గెయిల్‌ ఇండియా చెబుతోంది. కాబట్టి తాము ప్రభుత్వా నికి ఏమీ చెల్లించక్కర్లేదని వాదిస్తోంది. ఐపీ –1, ఐపీ–2 లైసెన్సులతో 2001–02 లో కేవలం రూ. 35 కోట్లు మాత్రమే ఆర్జిం చామని, డాట్‌ చెబుతున్నట్లు రూ. 2,49,788 కోట్లు కాదని గెయిల్‌ ఇండియా పేర్కొం ది. ఈ ఆదాయాన్ని
ప్రభుత్వం ఎలా పరిగణనలోకి తీసుకుందో తెలీడం లేదని వాపోతోంది. డాట్‌ కోరుతున్న బకాయిలు గెయిల్‌ మొత్తం నెట్‌ వర్త్‌‌‌‌కు మూడింతలుగా ఉన్నా యి. ఇక వాస్తవ ఆదాయం కంటే చాలా రెట్లు ఎక్కువ.