బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

 బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు
  •     బిల్లులు ఇస్తే తప్ప పనులు చేసేది లేదని వెల్లడి
  •     లోన్లు ఇవ్వలేమని తేల్చిచెప్పిన హడ్కో, ఆర్థిక సంస్థలు
  •     రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆగిపోయిన నిర్మాణాలు


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. రూ.800 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఇండ్లు కట్టలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పనులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన నిధులు ఇవ్వడం లేదు. మరోవైపు నిర్దేశిత వ్యవధిలోగా నిర్మాణాలు చేయడం లేదంటూ హడ్కో, ఇతర ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాయి. దీంతో డబుల్ ఇండ్ల పనులు ఎప్పటికి పూర్తవుతాయనే దానిపై క్లారిటీ లేదు. లక్షకుపైగా ఇండ్ల పనులు తుది దశల్లో ఉన్నాయని, అర్హులకు కేటాయించడమే తరువాయి అని ప్రభుత్వం చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా.. 
రాష్ట్రంలో గత ఏడేండ్లలో ప్రభుత్వం 2.91 లక్షల డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్లను శాంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇందులో లక్షకు పైగా పూర్తి చేశామని సర్కారు చెబుతోంది. కానీ 54 వేల ఇండ్లే పూర్తయ్యాయని తెలుస్తోంది. 71 వేలకు పైగా ఇండ్ల పనులు 90% వరకు పూర్తయ్యాయి. మరో పది శాతం పనులు చేస్తే వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయొచ్చు. ఇదే విషయాన్ని ప్రభుత్వం అసెంబ్లీతో పాటు పలు వేదికలపైనా ప్రకటించింది. కానీ ఆ ఇండ్ల పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు 63 వేలకు పైగా ఇండ్ల పనులు అసలు మొదలే కాలేదు. తమకు చెల్లించాల్సిన రూ.800 కోట్ల బకాయిలు త్వరగా ఇప్పించాలని కాంట్రాక్టర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో మూకుమ్మడిగా నిర్మాణాలు ఆపేశారు. బిల్లులు ఇస్తే తప్ప పనులు చేసేది లేదని తెగేసి చెప్పారు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10,431.57 కోట్లు ఖర్చు చేయగా.. అందులో 90 శాతానికిపైగా నిధులు అప్పులుగా తెచ్చినవే.
లోన్ల రీపేమెంట్ సక్కగ చేస్తలె
డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం హడ్కో, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.10 వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే లోన్ల రీపేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల రూపంలో లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీపేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉన్నా.. కరోనాను సాకుగా చూపి ఇంత వరకు పైసా చెల్లించలేదు. మరో వైపు హడ్కోతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణానికి రూ.900 కోట్ల వడ్డీ భారం పడింది. లోన్ల రీపేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో, నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో కొత్తగా అప్పు ఇచ్చేది లేదని హడ్కో, ఇతర సంస్థలు తేల్చిచెప్పాయి. రాష్ట్ర హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్న అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. తమ నుంచి తీసుకున్న లోన్ల వాయిదాలు చెల్లించాలని నోటీసులు జారీ చేశాయి. మరోవైపు ప్రధాన మంత్రి ఆవాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన కింద తాము ఇచ్చిన నిధులు వినియోగించడం లేదని, వాటి వినియోగానికి సంబంధించిన యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని కేంద్ర హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రిత్వ శాఖ లేఖలు రాస్తోంది. ఒకవేళ తాము ఇచ్చిన నిధులు వినియోగించని పక్షంలో తిరిగి ఇచ్చేయాలని ఆ లేఖలో కోరుతోంది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదు. సర్కారు నిధులివ్వక, హడ్కో లోన్లు రాక డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల పథకం ప్రమాదంలో పడింది.

నిధుల కేటాయింపు, ఖర్చు ఇలా..
ప్రభుత్వం ఏడేళ్లలో కేటాయించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     రూ.18,663 కోట్లు
హడ్కో నుంచి తీసుకున్న రుణం    రూ.3,344.76  కోట్లు
ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణం    రూ.6,055 కోట్లు
ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం    రూ.10,431.57 కోట్లు
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు    రూ.800 కోట్లు
(నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి)