ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. సిరియోలాజికల్‌ సర్వే ప్రారంభం

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. సిరియోలాజికల్‌ సర్వే ప్రారంభం

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసుల డబలింగ్‌ రేటు ఇప్పుడు 50కి పెరిగిందని, దేశంలో అది 21 రోజులు ఉందని ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ అన్నారు. “ ఢిల్లీలో శుక్రవారం 1195 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,35,98కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 10,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్యలో గతంలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ 12వ స్థానానికి చేరింది” అని మంత్రి అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు 496 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయని, ఈ మేరకు కేసులు ట్రేస్‌ చేసేందుకు శనివారం సిరియోలాజికల్‌ సర్వే ప్రారంభించామని అన్నారు. గత నెలలో చేసిన సర్వేలో 24 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇది టెక్నికల్‌ ప్రాసెస్‌ అని కానీ క్యాపిటల్‌ మొత్తంలో నిర్వహిస్తామని అన్నారు. నోయిడా, ఘజియాబాద్‌, హర్యానాలో కేసులు ఉన్నప్పటికీ హోటళ్లు ఓపెన్‌ చేస్తున్నారని, ఢిల్లీలో కేసులు తగ్గుతున్నందున హోటళ్లు తెరిచేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ పర్మిషన్‌ ఇవ్వాలని కోరారు. సిరియోలాజికల్‌ సర్వే ద్వారా చాలా మంచి ఫలితాలు కనిపించాయని, అందుకే కష్టమైనప్పటికీ ప్రతి నెల దాన్ని నిర్వహిస్తామని సత్యేంద్ర జైన్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.