యాక్సిడెంట్ చేసిన పోలీసు.. పైగా రుబాబు

యాక్సిడెంట్ చేసిన పోలీసు.. పైగా రుబాబు

“ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతయ్, హత్యలూ జరుగుతయ్. ఇంకా ఎన్నో జరుగుతుంటాయ్. ఇదీ కామన్ ” ఓ పోలీసు అన్న మాటలవి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ… తాగిన మత్తులో ఓ మహిళ కారును ఢీకొట్టిన అనంతరం ఆమెనే దుర్భాషలాడాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ద్వారకా రోడ్ లో జరిగింది.

అర్ధరాత్రి తాగిన మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఆ పోలీసు.. ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ కారులోని మహిళ  అతన్ని అడ్డగించగా.. రోడ్ మీద ఇలాంటి ప్రమాదాలు జరుతుంటయ్.. దానికి నేనేం చేయగలను.? అని నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. అతని మాటలకు ఆ సమయంలో రోడ్డుపై ఉన్న స్థానికులతో కలసి ఆ మహిళ అతన్ని కారు దిగాలని డిమాండ్ చేయగా..  అందుకు నిరాకరించాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ సమయంలో అతను యూనిఫాం ధరించే ఉన్నాడు.